ప్రముఖ హాలీవుడ్ హీరో విల్ స్మిత్ తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల ఫ్యాన్స్ ముచ్చటించిన విల్ స్మిత్ తాను పదహారు ఏళ్లలో ఎదుర్కొన్న పలు సంఘటనలు అభిమానులతో పంచుకున్నారు. 16ఏళ్లకే ఫస్ట్ బ్రేకప్ అయిందని.. అప్పటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. మెలనియా అనే అమ్మాయిని ప్రేమించానని.. ఇద్దరం సీరియస్ రిలేషన్ లో ఉన్నామని.. అదే సమయంలో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో భాగంగా రెండు వారాల పాటు మెలనియాకు దూరంగా ఉన్నానని చెప్పారు.
అదే సమయంలో ఆమె తనను మోసం చేసిందని.. మెలనియా మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని.. దీంతో ఆమెతో విడిపోయినట్లు తెలిపారు. తనతో బ్రేకప్ తరువాత తీవ్ర ఒత్తిడికి గురయ్యానని.. ఆ ప్రెషర్ నుంచి బయటపడడానికి విపరీతంగా శృంగారం చేశానని చెప్పుకొచ్చారు. రిలేషన్ లో ఉన్నప్పుడు మెలనియాతో మాత్రమే సన్నిహితంగా ఉండేవాడినని కానీ బ్రేకప్ తరువాత చాలా మంది మహిళలతో శృంగారం చేశానని చెప్పారు. ఇప్పుడు ఆ విషయాలు గుర్తు చేసుకుంటే..
అది నేనేనా అని ఆశ్చర్యంవేస్తుందని .. కానీ ఆ ఏం చేస్తున్నానో నన్ను నేను గమనించుకోలేదని చెప్పుకొచ్చారు. ఈ విపరీతమైన శృంగారం తనకు విరుద్ధంగా, ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేదని తెలిపారు. ప్రస్తుతం విల్ స్మిత్ ‘కింగ్ రిచర్డ్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?