Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు.. రిజెక్ట్ చేసిన సీనియర్ హీరో!

  • July 24, 2021 / 02:09 PM IST

కొన్నేళ్ల క్రితం ఎండెమోల్షైన్ ఇండియా స్టార్ మా సహకారంతో తెలుగులో కౌన్ బనేగా క్రోరోపతిని మీలో ఎవరు కోటీశ్వరుడుగా నిర్మించింది. అనంతరం సన్ నెట్‌వర్క్ ప్రోగ్రాం యొక్క హక్కులను దక్కించుకుంది. దీనిని తెలుగులో స్టార్ చేయాడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే దాదాపు కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.సన్ నెట్‌వర్క్ అధికారులు అప్పట్లో మంచు మోహన్ బాబును సంప్రదించి అతనికి హోస్ట్ గా చేసే ఆఫర్ ఇచ్చారట.

అయితే, మోహన్ బాబు దానిపై పెద్దగా ఆసక్తి చూపలేదట. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ప్రస్తుతం గేమ్ షో హక్కులను కలిగి ఉన్న సన్ నెట్‌వర్క్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ఎవరు మీలో కోటీశ్వరులు అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు, స్టార్ MAA లో నాగార్జున చిరంజీవి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరోవైపు విష్ణు, ఒటిటిలో తొలిసారిగా ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ మోహన్ బాబుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇక మోహన్ బాబు నెక్స్ట్ సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus