Kangana Ranaut: కంగనా సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో మద్దతు.. షాక్ లో టాలీవుడ్ సెలబ్రిటీస్?

  • May 16, 2022 / 02:18 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద బ్యూటీగా పేరు సంపాదించుకున్న కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎక్కువగా ఇండస్ట్రీలో నేపోటిజం గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇది వరకు ఎన్నో సార్లు ఇండస్ట్రీలో ఉన్న అగ్రహీరోలు ఖాన్, కపూర్, బచ్చన్ ల గురించి ఈమె తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలా నిత్యం బాలీవుడ్ అగ్రతారల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే కంగనా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఈమె చేసిన ఈ పోస్టు చూసి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే… కంగనా నటిస్తున్న తాజా చిత్రం ధాకడ్. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.

ఇది చూసిన కంగనా ఒక్కసారిగా షాకయ్యారు.అదేవిధంగా కంగనా సినిమాని సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేస్తున్నారని తెలియడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే కంగనా సల్మాన్ ఖాన్ పోస్ట్ ను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే సల్మాన్ పోస్టును షేర్ చేస్తూ.. నా దబాంగ్ హీరోకి ధన్యవాదాలు. ఆయన ఎంతో మంచి మనసున్న వ్యక్తి ఇకపై నేను ఇండస్ట్రీలో ఒంటరిదాన్ని అని ఎప్పుడు చెప్పను మెత్తం ధాకడ్‌ టీమ్‌ తరఫున మీకు ధన్యవాదాలు అని కంగనా ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus