స్టార్ హీరోకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన భార్య.. అసలేమైందంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారి గ్లామరస్ ఫోటోలను వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంటారు. అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు చేసే పోస్టులపై కొన్నిసార్లు నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ వారిని ట్రోల్ చేస్తుంటారు.అయితే కొందరు ఇలాంటి వాటిని చూసి చూడనట్టు వదిలేయగా మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం తమ గురించి ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వారికి తమదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో నిత్యం ఎంతో మంది సెలబ్రిటీలు దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటారు. ఇకపోతే బాలీవుడ్ నటి మీరా రాజ్ పుత్, షాహిద్ కపూర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ స్టార్ నటుడుగా కొనసాగుతున్నటువంటి షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. అయితే ఈ ఫోటో షేర్ చేసినప్పటికీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే తన భర్త షాహిద్ కపూర్ తన షేర్ చేసిన ఫోటో గురించి ట్రోల్ చేశారో ఆ క్షణమే ఈ ఫోటోపై అందరి దృష్టిపడింది.

ఏది ఏమైనా ఇలా భార్య గురించి స్వయంగా భర్త ట్రోలింగ్ చేయడంతో ఇది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇకపోతే మీరా రాజ్ పుత్ బాత్రూంలో మిర్రర్ సెల్ఫీ దిగారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో పై స్పందించిన షాహిద్ కపూర్ ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా షాహిద్ కపూర్ స్పందిస్తూ తన భార్య సెల్ఫీ తీసుకోవడానికి కనీసం బాత్రూం నుంచి బయటకు వచ్చేవరకు వేచి ఉండలేకపోయింది అంటూ ట్రోల్ చేశారు.

ఈ విధంగా తన భార్య గురించి ఇలాంటి ట్రోల్స్ చేయడంతో వెంటనే మీరా రాజ్ పుత్ స్పందించారు. ఈమె ఈ కామెంట్ పై కౌంటర్ ఇస్తూ.. ఇషాన్ కట్టర్ కి పోస్ట్ చేయాల్సింది పోయి పొరపాటుగా నాకు కామెంట్ చేశారు అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఇలా వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ట్రోల్స్, కౌంటర్లు ఇచ్చుకోవడంతో వీరి వ్యవహారం పై నెటిజన్లు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus