అల్లు అర్జున్ కోసం విలన్ గా మారిన స్టార్ హీరోయిన్

  • April 24, 2019 / 06:02 PM IST

50కి పైగా సినిమాల్లో నటించిన తర్వాత కూడా హన్సికను ఇప్పటికీ చాలామంది “దేశముదురు భామ” అనే పిలుస్తారు. ఆమె మొదటి సినిమాతో ప్రేక్షకులపై వేసిన మార్క్ అలాంటిది. ఆ సినిమాలో అల్లు అర్జున్ తో సమానంగా డ్యాన్స్ లు, పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన హన్సిక మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మరోమారు అల్లు అర్జున్ తో కలిసి నటించనుంది. అయితే.. ఈసారి హీరోయిన్ గా కాదండోయ్, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న క్రేజీ సినిమాలో ఆల్రెడీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. ఒక నెగిటివ్ షేడ్ ఉన్న టిపికల్ రోల్ కోసం హన్సికను సంప్రదించగా వెంటనే సమ్మతించ్చిందట.

గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేని హన్సిక ఈ క్రేజీ సినిమాతోనైనా మళ్ళీ తన కెరీర్ ట్రాక్ లో పడుతుందని ఆశిస్తుంది. ఇవాల్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రంలో సత్యరాజ్, టబు, రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో విడుదలకానున్న ఈ చిత్రం అల్లు అర్జున్ కి చాలా కీలకం కానుంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus