ఇండస్ట్రీలో నెపో కిడ్స్‌ న్యూ లవ్‌ స్టోరీ తెలుసా?

బాలీవుడ్‌లో సినిమా కుదిరినంత ఈజీగా ప్రేమలు కుదిరిపోతాయా? ఏమో అక్కడి హీరోలు, హీరోయిన్లను చూస్తే ఇదే డౌట్‌ వస్తూ ఉంటుంది. సినిమా షూటింగ్‌ మొదలై రోజులు గడిస్తే చాలు ప్రేమ చిగురించేసింది అంటూ వార్తలొచ్చేస్తాయి. కొత్త హీరో, పాత హీరో అనే లెక్కలు లేకుండా.. లేటెస్ట్‌ నాయిక, పాత నాయిక అనే భేదం లేకుండా ప్రేమలు పుట్టేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఫ్రెష్‌ ప్రేమ ఒకటి బాలీవుడ్‌లో పుట్టింది అంటున్నారు.

ముందుగా చెప్పినట్లు బాలీవుడ్‌లో అఫైర్లు, రిలేషన్‌షిప్‌ చాలా కామన్. హీరో హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ వచ్చినవారు ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. కానీ తొలి సినిమా షూటింగ్‌ ఇప్పుడిప్పుడే మొదలైన వాళ్లు కూడా రియల్ లైఫ్‌లో రొమాన్స్ చేయడం అరుదు అనే చెప్పాలి. తాజాగా ఇలాంటి ఓ జంట బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాళ్లే బాలీవుడ్ స్టార్‌ యాక్టర్‌ అమితాబ్ బచ్చన్ మనవడు, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌ కూతురు.

షారుఖ్ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతాబచ్చన్ నందన్ కుమారుడు అగస్త్య నందన్ కలసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ది ఆర్చీస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రషెష్‌ చూసి టీమ్‌ సుహానా, అగస్త్య అదరగొట్టేశారు అని చెబుతున్నారు. అయితే ఆన్‌ స్క్రీన్‌లోనే కాదు, ఆన్‌స్క్రీనలోనూ రొమాన్స్ అదిరిపోయింది అని అంటున్నారు. క్రిస్మస్ రోజున ఈ ఇద్దరూ ఓ లంచ్‌ మీటింగ్‌ పెట్టుకున్నారు.

ఆ సందర్భంగా ఇద్దరూ బయటికొస్తూ మీడియా కంటికి చిక్కారు. దీంతో ఈ యంగ్ కపుల్ రొమాన్స్ మొదలెట్టారా అంటూ బాలీవుడ్‌ మీడియా అని అంటోంది. జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ‘ది ఆర్చీస్’ మూవీపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. స్టార్ ఫ్యామిలీలకు చెందిన ఈ జోడీ, వెండితెరపై ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ఇక లవ్‌ జర్నీ సంగతి అంటారా? సినిమా అయిపోయాక కూడా కలిసి ఉంటే అప్పుడు చూద్దాం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus