స్టార్ హీరో పై పగతో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్న చీప్ పనులు!

  • December 20, 2023 / 12:49 PM IST

అతనొక టాప్ మ్యూజిక్ డైరెక్టర్. చేతినిండా సినిమా ఆఫర్లు ఉన్నాయి.ఇప్పుడు సెట్స్ లో ఉన్న చాలా పెద్ద సినిమాలు అన్నిటికీ ఇతనే మ్యూజిక్ డైరెక్టర్. ఏ మంత్రం వేశాడో..కానీ దర్శక నిర్మాతలు తమ పెద్ద సినిమాలకి ఇతనే మ్యూజిక్ డైరెక్టర్ గా కావాలి అంటూ పట్టుబట్టి మరీ పెట్టుకున్నారు. ఇదే ఇప్పుడు వారికి శాపం అయ్యింది. వరుస సినిమాలకి కమిట్ అవ్వడం వల్ల .. ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ సినిమాకి కూడా సరిగ్గా పనిచేయలేకపోతున్నాడు అనే కంప్లైంట్ ఉంది.

ఇతను ఇప్పుడు దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారాడట. ఔట్పుట్ విషయంలో వాళ్లకు ఏదైనా లోటు అనిపించి ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఫోన్ చేస్తే.. ఇతను లిఫ్ట్ చేయడం లేదట. పైగా తనకు నచ్చిన సినిమాలనే ప్రమోషన్ చేస్తున్నాడట. సరే.. ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. త్వరలో రిలీజ్ కాబోతున్న ఓ పెద్ద సినిమాకి కూడా ఇతనే సంగీత దర్శకుడు.మొన్నామధ్య ఈ సినిమా నుండి ఇతన్ని తీసేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు అని అతను తోసిపుచ్చాడు.

మరోపక్క (Director) డైరెక్టర్ కూడా.. ‘తన గత రెండు సినిమాలకి మంచి ఔట్పుట్ ఇచ్చాడు’ అనే ఉద్దేశంతో ఇతన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలి అని పట్టుబట్టాడు. అతని మాట నిర్మాత కూడా కాదనడు కాబట్టి.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి అలా కలిసొచ్చింది. కానీ హీరో దగ్గర మాత్రం తేడా కొట్టేసింది. ఇతను కంపోజ్ చేసిన ట్యూన్స్ ఆ హీరోకి నచ్చలేదు. వాటికి ప్రేక్షకాదరణ కూడా అంతంత మాత్రమే వస్తుంది.

ఈ విషయంలో ఆ హీరో… దర్శకుడిపై , నిర్మాత పై.. తెగ ఫైర్ అయిపోతున్నాడు. అయినా చివరి దశలో చేసేదేమీ లేదు. అయితే ఆ హీరో ప్రవర్తన పై ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పగబెట్టేసుకున్నాడు. దీంతో ఇతను షూటింగ్ స్పాట్లో తీసిన విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వేరే అకౌంట్ల ద్వారా షేర్ చేయిస్తున్నాడట. ఈ విషయం తెలుసుకున్న కొందరు ‘ఇవేం చీప్ బుద్దులు’ అంటూ చర్చించుకుంటున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus