వివాదాస్పద కామెంట్లు చేసి అయినా ట్రేండింగ్ లో ఉండాలని కొందరు భావిస్తుంటారేమో. ఈ లిస్టులో ముందు వరుసలో ఉంటుంది.. ప్రముఖ బాలీవుడ్ సింగర్ అయిన సోనా మొహపాత్ర. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు చేస్తూ ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అవుతూ ఉంటుంది.‘మీటూ’ టైములో ఉద్యమం మొదలుపెట్టినావిడ కంటే ఈవిడ హడావిడే ఎక్కువగా కనిపించేది.సరే ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే ‘ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్’ పేరుతో ఓ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో భాగంగా ఆమె తన కాలేజీలో ఎదర్కొన్న ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. సోనా మాట్లాడుతూ.. “నేను ఒకరోజు సల్వార్ దుస్తులు ధరంచుకుని ల్యాబ్‌కు వెళ్ళాను.అయితే మా సీనియర్లు కొంతమంది నా దగ్గరకి వచ్చి అసభ్యకరమైన కామెంట్లు చేశారు.నేను ధరించిన లో దుస్తుల గురించి వల్గర్ కామెంట్స్ చేసారు. ‘చున్నీ సరిగ్గా వేసుకోవడం రాదా.. పోనీ తీసెయ్యి’ అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఈ సంఘటన పై ఓ నెటిజన్ సోషల్ మీడియా ద్వారా సనాతో మాట్లాడుతూ..
‘ఈ ఘటన గురించి ఇంత బాధపడుతున్నారు కదా. మరి మీరెందుకు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తున్నారు. క్లీవేజ్ బాగా కనిపించే ఫొటోలు ఎందుకు షేర్ చేస్తున్నారు. ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉండొచ్చు కదా.! ఈ విషయాలను పక్కనపెట్టి ముందు పాటలు పాడటం పై మనసు పెట్టండి’ అంటూ కామెంట్ చేసాడు. ఇతని కామెంట్లకు సనా స్పందిస్తూ.. ‘నా శరీరం, నా క్లీవేజ్, నాకు నచ్చినట్టు నేనుంటా’ అంటూ ఘాటుగా జవాబిచ్చింది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?