బాలీవుడ్‌లో మరో వైవాహిక బంధం కోర్టు మెట్లెక్కింది. ప్రముఖ పాప్‌సింగర్ యో యో హనీసింగ్‌పై అతని భార్య షాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏకంగా 118 పేజీల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హనీ సింగ్, అతని కుటుంబం తనను పెడుతున్న టార్చర్, హనీసింగ్ రహస్య వ్యవహారాలు మొత్తం బట్టబయలు చేసేశారు షాలిని. అయితే దీనిపై హనీ సింగ్ ఇప్పటివరకు స్పందించలేదు.
హనీ సింగ్, అతని కుటుంబసభ్యులు తనను మానసికంగా, శారరీకంగా వేధిస్తున్నారంటూ షాలిని దిల్లీ కోర్టు మెట్లెక్కారు. పదేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న షాలినీ-హనీ సింగ్ 2011లో వివాహబంధంలో అడుగుపెట్టారు. తొలుత అంతా బాగానే ఉన్నా… ఆ తర్వాత తమ మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ షాలిని పేర్కొంది. ఈ మేరకు 118 పేజీల ఫిర్యాదు చేసింది. అంతేకాదు పెళ్లి విషయాన్ని హనీ సింగ్ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడని పేర్కొంది.
సోషల్ మీడియా వేదికగా వివిధ సందర్భాల్లో పెళ్లి ఫొటోలు షేర్ చేయడంతో తనను చిత్రహింసలకు గురి చేశారని షాలిని చెప్పారు. అంతేకాదు ఓ సందర్భంలో 18 గంటలపాటు భోజనం పెట్టకుండా ఓ గదిలో బంధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు షాలిని. అంతేకాకుండా హనీ సింగ్‌కు ఎంతోమంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని.. ఓసారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడని కూడా చెప్పింది. ఓసారి ప్రశ్నిస్తే మద్యం సీసాతో దాడి చేయబోయాడని షాలిని తెలిపారు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!