రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ పార్ట్‌నర్స్‌గా మారిన స్టార్స్ ఎవరంటే..!

‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు’.. ఇలా వెండితెర మీద హీరో హీరోయిన్లు పాట పాడుకుంటుంటే.. చూసే ప్రేక్షకులకు భలే ఫీలింగ్ కలుగుతుంది.. సినిమా చూస్తున్న ఆలుమగలు వెడ్డింగ్ సాంగ్స్ అప్పుడు సిగ్గుతో ఒకరినొకరు చూసుకుంటూ తమ వివాహ సందర్భాన్ని తల్చుకునేవారు.. ఇక స్టార్ల విషయానికొస్తే.. ఆన్ స్క్రీన్ రొమాన్స్, లవ్, మ్యారేజెస్, ఫస్ట్ నైట్ లాంటి సీన్లు తప్పవు.. అలా రీల్ లైఫ్ పార్ట్‌నర్‌ని రియల్ లైఫ్‌లోకి తెచ్చుకున్నవారు హాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చాలామందే ఉన్నారు.. అప్పటి జెమినీ గణేశన్, సావిత్రితో స్టార్ట్ చేస్తే.. రీసెంట్ లవ్ బర్డ్స్ గౌతమ్ కార్తీక్, మాంజిమా మోహన్ వరకు.. తమతో నటించిన కథానాయికలను మనువాడిన 10 మంది కథానాయకులు ఎవరో చూద్దాం..

1. జెమినీ గణేశన్ – సావిత్రి..

జెమినీ గణేశన్.. సావిత్రి.. ఇద్దరూ మహానటులే.. సావిత్రి తెలుగు, తమిళ్‌లో సూపర్ స్టార్ అయితే శివాజీ తమిళ చిత్ర పరిశ్రమని ఏలారు.. ఆయన అలిమేలు.. నటి పుష్పవల్లి (రేఖ తల్లి) తర్వాత తనతో నటించిన సావిత్రిని ఇష్టపడి మూడో పెళ్లి చేసుకున్నారు.. వీరి వివాహ బంధం విషాదాంతంగా ముగిసింది..

2. రాధిక – శరత్ కుమార్..

రాధిక తెలుగు, తమిళ్‌లో పాపులర్ యాక్ట్రెస్.. ఆర్. శరత్ కుమార్ కూడా అక్కడ స్టారే.. షూటింగులో పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. శరత్ కుమార్ మెదట ఛాయా దేవిని వివాహమాడారు. ఆమెతో వరలక్ష్మీ శరత్ కుమార్, పూజా ఇద్దరు కూతుళ్లున్నారు. తర్వాత రాధికను చేసుకున్నారు. వీరికి రాహుల్ అనే కొడుకున్నాడు..

3. ప్రభు – ఖుష్బు..

లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ తనయుడు ప్రభు.. నటి ఖుష్బుతో కొంతకాలం సీక్రెట్ ఎఫైర్ నడిపి.. 1993 సెప్టెంబర్ 12న వివాహమాడారు. కేవలం నాలుగు నెలల తర్వాత వీరు విడిపోవడం విశేషం..

4. ఆర్. పార్థిబన్ – సీత..

పార్థిబన్ తమిళనాట, సీత తెలుగు, తమిళ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు.. రీల్ లవ్‌ లానే రియల్ లైఫ్ స్టార్ట్ చేశారు.. 1990లో పెళ్లి.. 2001లో విడాకులు జరిగిపోయాయి..

5. రఘువరన్ – రోషిణి..

బాషా, శివ లాంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్లతో ఆకట్టుకున్న రఘువరన్, నటి రోషిణిని జీవిత భాగస్వామిని చేసుకున్నారు.. 1996లో మ్యారేజ్.. 2004లో డివోర్స్ అయ్యాయి..

6. అజిత్ – షాలిని..

స్టార్ హీరో అజిత్, షాలినితో ఒకే ఒక్క సినిమా చేశారు.. ఆ టైంలోనే ప్రపోజ్ చేసి.. 2000లో ఒక్కటయ్యారు.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు..

7. సూర్య – జ్యోతిక..

సూర్య, జ్యోతిక ఇద్దరూ కలిసి ఆరు సినిమాల్లో నటించారు.. 2006లో పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు.. వీరికి ఓ పాప, బాబు సంతానం..

8. ప్రసన్న – స్నేహా..

స్నేహా తన సహ నటుడు, సింగర్ ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. 2009లో మొదలైన రిలేషన్‌కి 2012లో వెడ్డింగ్‌తో శుభం కార్డ్ వేశారు..

9. ఆర్య – సయేషా..

తమిళ స్టార్ ఆర్య , ‘గజినీ కాంత్’ మూవీ చేస్తున్నప్పుడు కో స్టార్ సయేషాతో లవ్‌లో పడి.. పెద్దవాళ్లను ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు.. తన కంటే సయేషా 17 సంవత్సరాలు చిన్న..

10. గౌతమ్ కార్తీక్ – మాంజిమా మోహన్..

కోలీవుడ్, టాలీవుడ్ పాపులర్ యాక్టర్ కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్.. 2019లో మలయాళీ నటి మాంజిమాతో ‘దేవరాట్టం’ అనే సినిమా చేశాడు.. ఆప్పుడు ఇద్దరి మధ్య మొదలైన మదిలో గంటలు.. 2022లో మంగళ వాయిద్యాల వరకూ వచ్చాయి..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus