సినీ పరిశ్రమలో విషాదం.. ఆ టాప్ రైటర్ కన్నుమూత

సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu)  తండ్రి , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు (Venu Thottempudi)  తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్, ‘దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్‌, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్(Surya Kiran) , కోలీవుడ్ కమెడియన్ శేషు, డేనియల్ బాలాజీ (Daniel Balaji)  వంటి నటులు మరణించారు.

ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో షాక్ తగిలింది అని చెప్పాలి. డబ్బింగ్ సినిమాలకి అలాగే అందులోని పాటలకి రైటర్ గా పనిచేసే మాటల రచయిత శ్రీ రామకృష్ణ నిన్న మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో ఆయన సోమవారం రాత్రి మరణించినట్టు తెలుస్తుంది.కుటుంబ సభ్యులు ఈయన్ని చెన్నైలోని తేనాపేటలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

రామకృష్ణ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. మణిరత్నం (Mani Ratnam) , శంకర్ (Shankar) వంటి స్టార్ డైరెక్టర్ల వద్ద ఈయన పనిచేశాడు.50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రామకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన వ్యక్తి. అయితే ఆయన చెన్నైకి వెళ్లి అక్కడ లిరిసిస్ట్ గా సెటిల్ అయ్యారు. దాదాపు 300 డబ్బింగ్ చిత్రాలకు రైటర్ గా పనిచేశారు. ‘జీన్స్’ సినిమా టైంలో ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai Bachchan) వంటి స్టార్ హీరోయిన్ కి తెలుగు నేర్పించింది ఈయనే. డైరెక్టర్ గా కూడా ఈయన ‘బాల మురళీ ఎం ఎ’ ‘సమాజంలో స్త్రీ’ వంటి చిత్రాలు డైరెక్ట్ చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus