ఆర్ ఆర్ ఆర్ పై ఆసక్తి పెంచేస్తున్న లేటెస్ట్ వర్కింగ్ స్టిల్

  • May 20, 2020 / 02:40 PM IST

ఎన్టీఆర్ బర్త్ డే సోషల్ మీడియా వేదికగా గ్రాండ్ గా జరుగుతుంది. వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ఆయన పై శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. అలాగే టాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కి ప్రత్యేక శుభాకాంక్షలు చెవుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఆప్త మిత్రుడు, దర్శక ధీరుడు రాజమౌళి ఓ స్పెషల్ త్రో బ్యాక్ పిక్ పంచుకొని ఎన్టీఆర్ కి బర్త్ డే విషెష్ చెప్పారు. నా విజయ యాత్రలో తోడున్న తారక్, నీకన్నా గొప్ప భీమ్ నాకు దొరకడు…

అని ప్రస్తుత ఆర్ ఆర్ ఆర్ మూవీని ఉద్దేశిస్తూ ఆయన పోస్ట్ పెట్టడం గమనార్హం. మరి ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ తో పాటు వెండితెర పంచుకుంటున్న రామ్ చరణ్ కూడా ఓ స్పెషల్ పిక్ పంచుకొని బర్త్ డే విషెస్ చెప్పారు. ఐతే చరణ్ పంచుకున్న ఆ ఆర్ ఆర్ ఆర్ వర్కింగ్ స్టిల్ అనేక అనుమానాలు మరియు ఆసక్తి రేపుతోంది. ఆ ఫొటోలో ఎన్టీఆర్ మరియు చరణ్ ఒకే తరహా కాస్ట్యూమ్స్ ధరించి ఉన్నారు. వైట్ అండ్ వైట్ ధరించి ఉన్న వీరు ఏ సన్నివేశం కోసం అలా తయారయ్యారు అనేది ఆసక్తి రేపుతోంది.

ఆ కాస్ట్యూమ్ ని బట్టి చూస్తే అది ఓ పాట కోసం ధరించిన దానిలా ఉంది. ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఓ పాటలో వీరిద్దరూ కలిసి డాన్స్ చేస్తారేమో అనిపిస్తుంది. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ నుండి వస్తున్న ఒక్కొక్క లీక్ ఆ చిత్రం అద్భుతంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. ఇక చరణ్ ఆ ట్వీట్ లో ఎన్టీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, అది అద్భుతంగా ఉంటుంది అన్నారు.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus