కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే కావ్యను ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో కనకం దంపతులో దుగ్గిరాల ఫ్యామిలీ పై సీరియస్ అవుతూ కావ్యను పుట్టింటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ దంపతులు కావ్యను వారి ఇంటికి తీసుకెళ్ళి పోతూ ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా వారిని ఆపే ప్రయత్నం చేయలేదు.
అదే సమయంలోనే సుభాష్ బయట నుంచి ఇంటికి వస్తారు. ఇలా తన కోడలు పుట్టింటికి వెళ్లిపోవడంతో షాక్ అవుతారు. ప్రకాష్ మాట్లాడుతూ కావ్యాను రాజ్ బయటకు గెంటేశారు అని చెప్పడంతో కనకం దంపతులు కావ్యను తన పుట్టింటికి తీసుకెళ్లి పోతున్నామని కృష్ణమూర్తి చెబుతారు. దీంతో సుభాష్ అసలు మీరెవరు నా కోడల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి అంటూ సుభాష్ ప్రశ్నిస్తారు.పెళ్లయి ఆడపిల్ల అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత తనకు తండ్రి అయిన మామయ్య అయిన నేనే అంటూ తన కోడలు చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్తారు.
సుభాష్ కావ్యను తీసుకురావడంతో అందరూ షాక్ అవుతారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది నేను ఇంట్లో లేని సమయంలో నా కోడలను బయటకు గెంటేసే హక్కు ధైర్యం ఎవరికి ఉన్నాయి అంటూ అందరినీ ప్రశ్నిస్తారు. అసలు నువ్వే అనుకుంటున్నావు రాజ్ కావ్యను బయటకు పంపించడానికి నువ్వెవరు అంటూ తనని తిడతారు. అంతలోపు అపర్ణ మాట్లాడబోతుండగా నువ్వు మాట్లాడవద్దు నీ వల్లే వీడు ఇలా తయారవుతున్నారు అంటూ సీరియస్ అవుతాడు.మరోవైపు దుగ్గిరాల కుటుంబ పరువు ప్రతిష్టలు బజారు పడ్డాయని చెప్పే మీ పెద్దరికం ఏమైంది అంటూ వారి తల్లిదండ్రులను కూడా తిడతారు.
అంతలోపు రుద్రాన్ని ఏదో కల్పించుకోవడంతో అసలు వీటన్నిటికీ కారణం నువ్వే తన భార్యకు లేనిపోనివన్నీ చెప్పి తన మనసు పాడు చేస్తున్నావు నీలాగా భర్తను వదిలేసి తను కూడా పుట్టింటిలో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రుద్రానికి చివాట్లు పెడతారు.ఈ ఇంట్లో నుంచి నిన్ను పొమ్మనే హక్కు ఎవరికీ లేదు నువ్వు నీ గదికి వెళ్ళు అంటూ కావ్యకు చెప్పగా కావ్య లోపలికి వెళ్తుంది.కృష్ణమూర్తి కనకం దంపతులు సుభాష్ కి దండం పెట్టగా సుభాష్ మాత్రం డ్రైవర్ కి చెప్పి వారిని తమ ఇంట్లో దించి రమ్మని చెబుతారు.
గదిలోకి వెళ్లిన తర్వాత ఆపర్ణ తన భర్తతో గొడవకు దిగుతుంది దీంతో సుభాష్ మాట్లాడుతూ ఇప్పుడు తానంత తప్పు పని ఏం చేసింది ఒక్కసారి కావ్యను మంచి మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అయినా నువ్వు ద్వేషించే అంత తప్పు తనేం చేసింది అంటూ ఆపర్ణకు అర్థమయ్యేలా చెబుతారు. మరోవైపు కనకం దంపతులు కావ్యను మనం ఇక్కడకు తీసుకొని వచ్చుంటే పెద్ద తప్పు జరిగిపోయి ఉండేది సమయానికి వియ్యంకుల వారు వచ్చారు కాబట్టి సరిపోయిందని మాట్లాడుతూ ఉండగా అంతలోపు అప్పు వచ్చి వారికి డబ్బు ఉంటే వారు ఎన్ని అన్నా అక్కపడి ఉండాలా మీరు అక్కని ఇక్కడికే తీసుకురావాల్సింది
అంటూ తల్లిదండ్రుల మీద కోప్పడుతుంది. తన గదికి వెళ్ళిన తర్వాత కావ్య రాజ్ వద్దకు వెళ్లి అసలు ఏం జరిగిందో తనకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని అనుకుంటుంది.తాను ఉద్దేశపూర్వకంగా అత్తయ్యను అలాంటి మాటలు అనలేదని ఫ్లోలో వచ్చాయని కావ్య చెబుతూ ఉండగా రాజ్ మాత్రం కోపంతో తలపుకు కొట్టడంతో తన చేతికి రక్తం వస్తుంది. అయినప్పటికీ రాజ్ అలాగే వెళ్లి పడుకుంటారు దాంతో కావ్య చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కడుతుంది. ఇంతటితో (Brahmamudi) ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్