ఓ సినిమా పరాజయాన్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి అంటారు. అంటే తమ సినిమా ఫ్లాప్ అయ్యిందని హీరో కానీ, దర్శకుడు కానీ ధైర్యంగా చెప్పగలగాలి. అలాంటప్పుడే ఆ సినిమాలో ఏం తప్పు చేశామో తెలుసుకొని.. తర్వాతి సినిమాల్లో అలాంటి తప్పులు చేయకుండా చూసుకుంటారు. అలా కాకుండా సినిమా ఫలితం మీద వితండవాదం చేస్తే.. దానిని ఏమంటారు. అలాంటి వ్యక్తుల్ని ఏమంటారు. వాళ్లను ఏమంటారో తెలియదు కానీ.. అలా వాదించే హీరోలను నాని అని అంటారు.
అయితే ఇప్పుడు దానికి మరో పేరు కూడా యాడ్ అయ్యింది. అతనే సుధీర్‌బాబు. కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు సినిమాలు నేరుగా ఓటీటీకి వెళ్లాయి. అలా వెళ్లిన తొలి సినిమాల్లో ‘V’ ఒకటి. నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రమిది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలైన సరైన ఫలితం అందుకోలేకపోయింది. అయితే ఈ ఫలితంపై గతంలో నాని చేసిన వ్యాఖ్యల్నే.. ఇప్పుడు సుధీర్‌బాబు కూడా చేయడం గమనార్హం.
‘వి’ సినిమా విడుదలై సుమారు రెండేళ్లు అవుతోంది. 2020 సెప్టెంబరు 5న ఈ సినిమాను విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్ట్రీమింగ్ ప్రారంభమైన తొలి రోజుల్లోనే సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అది కొనసాగింది. అయితే నాని మాత్రం మా ‘వి’కి మంచి టాక్ వచ్చిందని, సినిమా హిట్టని చెబుతుంటాడు. మీడియా ప్రతినిధులు వసూళ్ల లెక్కల ప్రస్తావనతో ముందుకొచ్చినా.. వాదించి వాదించి తమ సినిమా హిట్ అంటుంటాడు.
ఇప్పుడు సుధీర్‌బాబు కూడా ఇలానే మాట్లాడుతున్నాడు. సుధీర్‌బాబు – మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో తాజాగా రూపొందిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా ప్రచారంలో భాగంగా ఇంద్రగంటిని.. ‘వి’ రిజల్ట్ గురించి మీడియా అడిగింది. అయితే సుధీర్ బాబు మైక్ మమధ్యలో అందుకుని మాట్లాడి ఆ సినిమా హిట్ అని అన్నాడట. మూవీ రేటింగ్ వెబ్‌సైట్ ఐఎండీబీలో ‘వి’ సినిమాకు 7 రేటింగ్ దక్కిందని కూడా చెప్పాడు. అలా నాని బాటలో సుధీర్ నడుస్తున్నాడు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?