యాక్షన్‌ హంగామా షురూ.. గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?

ఆడపిల్ల తొలి రోజు స్కూలుకు బెరుకుగానే స్కూలుకు వెళ్తుంది. అదే తండ్రి స్కూలు లోపలకు వచ్చి పక్కన కూర్చుంటాడు అని తెలిస్తే ఎంత ధైర్యంగా అడుగు ముందుకేస్తుంది చెప్పండి. అలాంటి అవకాశం ఇప్పుడు సుహానా ఖాన్‌కు దక్కింది అంటారు. ఇండస్ట్రీలో చాలా హీరోకు, హీరోయిన్లకు దక్కని ఈ అవకాశం సుహానాకి దక్కింది. ఆమె బిగ్‌ స్క్రీన్‌పై చేసే తొలి సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌లో రోల్‌ తండ్రి షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటిస్తున్నాడట. దీంతో లాంచ్‌ అంటే ఇలా ఉండాలి అని బాలీవుడ్‌ బాద్‌షా ఫ్యాన్స్‌ అంటున్నారు.

కథానాయకులు తమ వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. అలా షా రుఖ్‌ కుమార్తె సుహానా ఎంట్రీ కోసం బాలీవుడ్‌ జనాలు ఎదురుచూస్తున్నారు. క్లిక్‌ అయితే మనమూ తీసుకొచ్చేద్దాం అని టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తొలి సినిమా ఓకే అయిపోయింది. సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో ఆమె తన తొలి సినిమా చేయనుంది.

భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈసినిమాలో షారుఖ్‌ కూడా నటిస్తున్నట్లు చెబుతునర్నారు. సినిమాలో సుహానాకు మార్గనిర్దేశం చేసే గురువుగా ఆయన సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. సినిమాలో కీలక సమయాల్లో షారుఖ్‌ ఎంట్రీ ఉంటుందట. మరి ఆ పాత్రలు ఎలా ఉంటాయి, ఇద్దరి స్క్రీన్‌ ప్రజెన్స్‌ చూశాక వెండితెర మీద ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి షా రుఖ్‌ పాత్రను పెంచారు అని చెబుతున్నారు. సినిమాలో ఇద్దరూ పోటాపోటీగా కనిపిస్తారు అని చెబుతున్నారు. మరి ఈ గురుశిష్యుల మధ్య ఎలాంటి సీన్స్‌ రాశారో చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల కోసం విదేశీ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌లను తీసుకొస్తున్నారట. ఆగస్టులో సినిమా షూటింగ్‌ ప్రారంభించి… వీలైంత త్వరగా సినిమాను రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. వన్స్‌ యాక్షన్‌ చెప్పాక… చాలా విషయాలు తెలుస్తాయి. అన్నట్లు సుహానా ఇప్పటికే ‘ఆర్చీస్‌’తో ఓటీటీకి పరిచయమే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus