Tenant Review in Telugu: టెనెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 19, 2024 / 11:41 AM IST

Cast & Crew

  • సత్యం రాజేష్ (Hero)
  • మేఘా చౌదరి (Heroine)
  • చందన పయ్యావుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌ కాంత్‌, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేఘ్న తదితరులు (Cast)
  • వై.యుగంధర్ (Director)
  • మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి (Producer)
  • సాహిత్య సాగర్ (Music)
  • జెమిన్ జోమ్ అయ్యనేత్ (Cinematography)

‘సత్యం’ రాజేష్ (Satyam Rajesh) కూడా హీరోగా మారాడు. అతను హీరోగా చేసిన ‘మా ఊరి పొలిమేర’ ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. దానికి సీక్వెల్ గా వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) అయితే గతేడాది థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది. దీంతో హీరోగా కూడా సత్యం రాజేష్ కొంత ఇమేజ్ బిల్డ్ చేసుకున్నట్టు అయ్యింది. ఈ క్రమంలో ‘టెనెంట్’ అనే మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి దీంతో అతను హ్యాట్రిక్ కొట్టాడో లేదో తెలుసుకుందాం రండి :

కథ : గౌతమ్(సత్యం రాజేష్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగా సెటిల్ అయిన తర్వాత తన మరదలు సంధ్య(మేఘా చౌదరి) (Megha Chowdhury) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలం వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగానే సాగుతుంది. కానీ తర్వాత అనూహ్యంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో వీరి మధ్య దూరం పెరుగుతుంది. అటు తర్వాత ఓ రోజు సంధ్య మరణిస్తుంది. ఆమె డెడ్ బాడీని రహస్యంగా సూట్ కేసులో పెట్టుకుని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు గౌతమ్.

సంధ్య మరణానికి గౌతమ్ కారణమా? అయితే ఎందుకు గౌతమ్ తాను ప్రేమించిన సంధ్యని చంపేశాడు? కాదు అంటే గౌతమ్ ఆ హత్య చేయలేదా? మరి దాని వెనుక ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ‘టెనెంట్’ చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: సత్యం రాజేష్ ఈ సినిమాలో కూడా తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటాడు. ఎమోషనల్ సీన్స్ లో జీవించాడు అని చెప్పవచ్చు. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా ఎక్స్ప్రెషన్స్ తోనే మంచి మార్కులు కొట్టేశాడు. కాకపోతే ఈ పాత్రకి ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. మేఘా చౌదరి తన లుక్స్ తో పాటు నటనతో కూడా ఆకట్టుకుంటుంది. ‘నా కథలో’ అనే సాంగ్లో ఆమె ఎక్స్ప్రెషన్స్ స్పెషల్ గా అనిపిస్తాయి. ఎస్తేర్ (Ester Noronha) పోలీస్ పాత్రలో బాగానే చేసింది. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఆమె నటన బెటర్ గా అనిపిస్తుంది.

చందన పయ్యావుల పాత్ర కూడా ఎమోషనల్ గా ఉంటుంది. ఆమె కూడా బాగానే నటించింది. ఋషి పాత్రలో భరత్ కాంత్ ఓకే అనిపిస్తాడు. యాంకర్ చందు..కి ‘టెనెంట్’ ద్వారా ఓ మంచి రోల్ దొరికింది. ఈ పాత్రకి అతను న్యాయం చేశాడు.కావ్యగా రమ్య పొందూరి (Ramya Ponduri) కన్నింగ్ పెర్ఫార్మన్స్ ఓకే అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టు పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘ఆడవాళ్లకు రక్షణ కల్పించడం సొసైటీ కొన్ని విధాలుగా ఫెయిల్ అవుతుంది’ అంటూ దర్శకుడు వై.యుగంధర్ ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ని అతను బాగానే డీల్ చేశాడు. సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి రెండు జంటలకు జరిగిన అన్యాయాన్ని ఒకేసారి చూపించే పని పెట్టుకున్నాడు. దీంతో కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ అతను చెప్పాలనుకున్న కోర్ పాయింట్ చెప్పగలిగాడు. ప్రేక్షకులను కన్విన్స్ చేయగలిగాడు.

సినిమాటోగ్రాఫర్ జెమిన్ జోమ్ అయ్యనేత్ కచ్చితంగా ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు అనడంలో సందేహం లేదు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది అంటే ఇతని పనితనం వల్లే ఫీలింగ్ కలుగకమానదు. సాహిత్య సాగర్ సంగీతం కూడా బాగుంది. ఉన్నది ఒక్క పాటే అయినా వినడానికి, చూడటానికి అది బాగానే ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.

విశ్లేషణ: ‘టెనెంట్’ ఓ మంచి పాయింట్ తో తెరకెక్కిన మూవీ. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లి చూస్తే ఓ డిఫరెంట్ ఫీల్ ను కలిగిస్తుంది.. ఆలోచింపజేస్తుంది. రన్ టైం కూడా ఒకటిన్నర గంటలే కాబట్టి… ఈ వీకెండ్ కి థియేటర్లలో ట్రై చేయొచ్చు.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus