Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

సుజీత్ దర్శకుడిగా మారి 10 ఏళ్ళు దాటింది. ఈ దశాబ్ద కాలంలో అతను చేసింది కేవలం 3 సినిమాలే. 2014 లో ‘రన్ రాజా రన్’ వచ్చింది. అది డీసెంట్ సక్సెస్ అందుకుంది. సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది.  ట్విస్ట్..లు వంటివి కూడా అదిరిపోయాయి. సుజీత్ వర్క్ చూసి ఇంప్రెస్ అయిపోయి.. వెంటనే సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యాడు. ‘బాహుబలి 2’ తర్వాత సుజీత్ తో ‘సాహో’ మొదలుపెట్టాడు ప్రభాస్.

Sujeeth

అయితే ‘బాహుబలి 2’ తో పెరిగిన అంచనాలు అన్నీ సుజిత్ పై భారం పెంచాయి. అయినప్పటికీ టీజర్, ట్రైలర్స్ వంటి వాటితో సినిమాకి బోలెడంత బజ్ ను తీసుకొచ్చాడు. కానీ ఫలితం తేడా కొట్టేసింది. సుజిత్ ఏదైతే క్రియేటివిటీ అనుకున్నాడో అది ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసింది. తర్వాత ఫలితం అందరికీ తెలిసిందే. ఆ తప్పులు కొంత వరకు రిపీట్ చేయకుండా పవన్ కళ్యాణ్ తో ‘ఓజి’ చేశాడు.

ఈ సినిమాని ఎంతవరకు పుష్ చేయాలో అంత వరకు పుష్ చేశాడు.అయితే ఊహించని విధంగా సుజిత్ కెరీర్లో గ్యాప్ వచ్చేసింది. ‘రన్ రాజా రన్’ రిలీజ్ అయిన 5 ఏళ్ళ తర్వాత ‘సాహో’ వచ్చింది. అందుకు కారణం ప్రభాస్ ‘బాహుబలి’ కమిట్మెంట్ వల్లే అనుకోవాలి. ఇక ‘సాహో’ రిలీజ్ అయిన ఏడాదిన్నరకి ‘ఓజి’ మొదలైంది. అది పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఆలస్యమైంది.

అందుకే ఈసారి పెద్ద ప్రాజెక్టుల జోలికి పోకుండా.. నానితో ఓ మిడ్ రేంజ్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు సుజిత్. ఇదొక డార్క్ కామెడీ జోనర్ మూవీ అని తెలుస్తుంది. ‘ఓజి’ హవా ముగిసిన వెంటనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus