Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు వయస్సు 73 ఏళ్ళు. ఆయన కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కాలికి సర్జెరీ కూడా జరిగింది అని మొన్నామధ్య వార్తలు వచ్చాయి.అందుకే మోహన్ బాబు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. మంచు లక్ష్మీ, మంచు విష్ణు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేయాల్సి వస్తే చేస్తున్నారు.. తప్ప వేరే సినిమాలు చేసే మూడ్ లో ఆయన లేరు అని మొన్నటివరకు టాక్ నడిచింది.

Mohan Babu

ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు కథలు చెప్పడానికి వెళ్లేంత సాహసాలు కూడా దర్శకులు చేస్తారన్న గ్యారెంటీ లేదు. మరోపక్క మోహన్ బాబుకి థ్రెట్ కూడా ఉంది.ఆయన్ని చంపేస్తామంటూ ఒకానొక టైంలో కొంతమంది కారులో వెళ్లి మోహన్ బాబుని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఈ కారణాల మధ్య మోహన్ బాబు సినీ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని అంతా అనుకున్నారు.

కానీ అందరికీ షాకిస్తూ ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేస్తున్నారు. అలా అని అవి సహాయ నటుడి పాత్రలు కాదు. మెయిన్ విలన్ రోల్స్ అనే చెప్పాలి. ఇటీవల మంచు విష్ణు ‘కన్నప్ప’లో శాస్త్రి పాత్ర చేసిన మోహన్ బాబు… ఇప్పుడు నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించి కొన్ని పోస్టర్స్ ను ఈరోజు వదిలారు. అందులో మోహన్ బాబు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు.

శికంజ మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారు. ఇది మాత్రమే కాదు సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు అయినటువంటి ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా మోహన్ బాబు మెయిన్ విలన్‌గా కనిపించనున్నారు. ‘ఆర్.ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించిన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు.

హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus