Suma: సుమ చేసిన పనికి సీరియస్ అయినా నటరాజ్ మాస్టర్!

తెలుగు బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుమ గురించి చెప్పాల్సిన పనిలేదు ఈమె గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే సుమ వ్యాఖ్యతగా బుల్లితెరపై సుమ అడ్డ అనే కార్యక్రమం ప్రసారమవుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఎంతో ప్రశాంతంగా ఆటపాటలతో సాగిపోయింది. ఇక ఈ శనివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా కొరియోగ్రాఫర్స్ అయినటువంటి ఆట సందీప్ మాస్టర్ తన భార్యతో కలిసి వచ్చారు. అదేవిధంగా నటరాజ్ మాస్టర్ తన భార్య నీతూతో కలిసి వచ్చారు ఎప్పటిలాగే ఈ కార్యక్రమం కూడా ఎంతో సరదాగా సాగింది. ఈ కార్యక్రమానికి డాన్స్ మాస్టర్స్ రావడంతో సుమ నటరాజ్ మాస్టర్ సందీప్ మధ్య డాన్స్ పోటీ నిర్వహించింది. వీరిద్దరూ డాన్స్ చేయడంతో అక్కడున్నటువంటి వారంతా కూడా ఎంతో ఎంజాయ్ చేశారు.

ఇక చివరికి విన్నర్ ఎవరు అనే ప్రకటించే సమయం రావడంతో (Suma) సుమ అక్కడే ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ను స్టేజ్ పైకి పిలిచింది. ఇక విన్నర్ ఇస్ అంటూ ఆ స్టూడెంట్ చేతిలో కప్పు పెట్టింది దీంతో నటరాజ్ మాస్టర్ కు పిచ్చ కోపం వచ్చిందని తెలుస్తోంది. ఇలా సుమ వీరిద్దరికీ కాకుండా కాలేజీ స్టూడెంట్ కు కప్పు ఇవ్వడంతో నటరాజ్ మాస్టర్ చాలా సీరియస్ అయ్యారు.

నేను కొన్ని విషయాల వరకు మాత్రమే కామెడీగా ఉంటాను కానీ మీరు ఇప్పుడు మాత్రం నన్ను అవమానించారు అంటూ సుమపై సీరియస్ అవ్వడమే కాకుండా తన భార్య నీతూను కూడా అక్కడి నుంచి లాక్కొని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. అయితే ఇది నిజంగానే జరిగిందా లేకపోతే ప్రోమోలో భాగమ అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు నటరాజ్ మాస్టర్ ప్రతి ఒక్క కార్యక్రమంలోని ఇలా గొడవ పెట్టుకుని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus