ఇంతకీ ఎవరు దానమివ్వమన్నారు సుమంత్..!

నాగార్జున తర్వాత అక్కినేని వారసుడిగా పరిచయమయ్యాడు సుమంత్. సుమంత్ వచ్చిన పదేళ్లకు తెరపైకొచ్చిన నాగచైతన్య ఎనిమిదేళ్లలో పన్నెండు సినిమాలు చేస్తే సుమంత్ పదిహేడేళ్లలో 17 సినిమాలు మాత్రమే. అంటే సగటున ఏడాదికొకటి. సినిమాల సంఖ్యతోపాటు సక్సెస్ రేటు తక్కువగా ఉన్న సుమంత్ మరి కొద్దిరోజుల్లో ‘నరుడా డోనరుడా’ సినిమాలో వీర్యదాతగా ప్రేక్షకులముందుకు రానున్నాడు.బాలీవుడ్ సినిమా ‘విక్కీ డోనర్’కి రీమేక్ గా చేసిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకుడు. వీర్యదానం అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఊహించదగనవి. ఇటువంటి కథతో సినిమా చేయడం ఓ రకంగా ప్రయోగమే. అయితే సుమంత్ ఈ సినిమా చేయడానికి కారణం నిర్మాత రామ్మోహన్ అని ఆడియో వేదికపై చెప్పారు. బాగానే ఉందనుకుంటే నిన్నటికి నిన్న ప్రచార కార్యక్రమాల్లో తాతగారి పేరు తెరపైకి తీసుకోచ్చాడీ అక్కినేని హీరో. నాగేశ్వరరావు గారు చివరి రోజుల్లో చూసిన సినిమాల్లో ఇదొకటని ఇలాంటి కొత్త కథలు తెలుగులోనూ రావాలని ఆయన అభిలషించారట.

ఆ స్ఫూర్తితోనే ఈ సినిమా చేసినట్టు చెప్పుకొచ్చాడు సుమంత్. ఇందులో వాస్తవం ఎంతో గానీ ప్రచారం కోసం ఏఎన్నార్ పేరుని వాడుతున్నాడా..? అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.ఇక సినిమా విషయానికొస్తే.. ‘విక్కీ డోనర్’ కథ విన్ననాటినుండి తనవద్దకు వచ్చిన నిర్మాతలందరికీ ఈ కథ చెప్పానన్న సుమంత్ చివరికి తనే నిర్మాతగా మారి చెల్లెలు సుప్రియ, సుధీర్ పూదోటలతో కలిసి నిర్మించాడు. దర్శకుడికిది తొలి సినిమానే అయినా తక్కువ బడ్జెట్ లో, 60 రోజుల్లో సినిమాని పూర్తి చేసేశాడని దర్శకుడిని పొగడ్తల వర్షంలో ముంచెత్తాడు సుమంత్. సుమంత్ చేస్తున్న దానం అయినా అతడికి మంచి ఫలితాన్ని ఇస్తే బావుణ్ణు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus