రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో సుందర్ సి చిత్రం..!

  • June 4, 2016 / 12:14 PM IST

కోలీవుడ్ లో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా సుందర్ సికి  పేరుంది. చారిత్రక నేపధ్యం కథాంశంతో త్వరలో ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. దాదాపు రూ. 250 కోట్లతో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్నినిర్మించనున్నారట. శ్రీ తెనానడల్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ నిర్మాణ సంస్థ 99 చిత్రాలను నిర్మించగా.. 100వ చిత్రంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించనుంది.

బాహుబలి, మగధీర చిత్రాలను పనిచేసిన చిత్ర బృందం ఈ చిత్రాన్ని పనిచేయనుండగా.. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఏ‌ఆర్ రెహ్మాన్ పేర్లను పరిశీలిస్తున్నారు. త్రిభాషా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుండగా.. సూర్య ఇందులో నటించే అవకాశం ఉందని, ఓ ప్రముఖ బాలీవుడ్ నటి ఇందులో నటించనుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాగా ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వం వహించిన ‘ముత్తున కతీరిక’ చిత్రం జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus