నారా రోహిత్ ఈ ఆగస్టు 27న అంటే వినాయక చవితి పండుగ నాడు ‘సుందరకాండ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేశాయి. రిలీజ్ రోజున పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో మొదటి రోజు సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. పండుగ హాలిడే అడ్వాంటేజ్ తో ఆ ఫీట్ సాధ్యమైంది అని స్పష్టమవుతుంది.
అయితే మౌత్ టాక్ ఇంపాక్ట్ వల్ల 2వ రోజు కలెక్షన్స్ పెరుగుతాయి అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు. బహుశా వీక్ డేస్ వల్ల అనుకోవాలి. ఈ క్రమంలో వీకెండ్ ను గట్టిగా క్యాష్ చేసుకోవాల్సిన ప్రెజర్ ఏర్పడింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.46 cr |
సీడెడ్ | 0.11 cr |
ఆంధ్ర(టోటల్) | 0.39 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.96 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.08 cr |
ఓవర్సీస్ | 0.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.19 cr (షేర్) |
‘సుందరకాండ’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.1.19 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.15 కోట్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ సినిమా 2వ రోజు మాత్రం డౌన్ అయిపోయింది అనే చెప్పాలి.మరి వీకెండ్లో ఏమైనా గ్రోత్ చూపిస్తుందేమో చూడాలి