ఫిబ్రవరి నెల డిమాండ్ బాగా పెరిగిపోయింది!

ఇదివరకు ఫిబ్రవరి సీజన్ అంటే చాలా డల్ గా సాగేది. ఆ నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యేవి కావు. సంక్రాంతి తరువాత ఫిబ్రవరి మొత్తం డల్ గా ఉండే బాక్సాఫీస్.. మళ్లీ మార్చి నెలాఖరులో ఊపందుకుంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్టూడెంట్స్ ఎక్కువ మంది పరీక్షలతో బిజీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేసినా.. సరైన కలెక్షన్స్ ఉండవు. అందుకే దర్శకనిర్మాతలు కూడా ఆ సమయానికి సినిమాలు రిలీజ్ చేయడానికి ఇష్టపడరు.

చిన్న చితకా సినిమాలు మాత్రమే వస్తుంటాయి. కానీ కరోనా టైం నుంచి పరీక్షల సమయంలో తేడాలు రావడంతో సినిమాల వ్యవహారం కూడా మారిపోయింది. 2021, 2022లో ఫిబ్రవరిలో పేరున్న సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. భారీ కలెక్షన్స్ కూడా సాధించాయి. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేదు. పరీక్షలు ఎప్పటిలానే జరుగుతున్నాయి. అయినప్పటికీ.. ఫిబ్రవరిలో చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.

నవంబర్, డిసెంబర్ నెలల్లో రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు కూడా వాయిదా పడి మరీ ఫిబ్రవరిలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి 17న ధనుష్ ‘సార్’ సినిమా, విశ్వక్ సేన్ ‘ధమ్కీ’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ లాంటి సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. వాటికి పోటీగా సమంత ‘శాకుంతలం’ కూడా అప్పుడే రాబోతుంది. ఫిబ్రవరి నెల ప్రారంభంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ రాబోతుంది.

అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా సంక్రాంతికి అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా మరో సినిమా ఫిబ్రవరి రేసులోకి వచ్చింది. సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘మైకేల్’ను ముందుగా డిసెంబర్ నెలాఖరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 3న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అలా ఫిబ్రవరి నెలలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ లిస్ట్ లో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus