ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కి ఛాన్స్!

హాస్య నటుడిగా పేరుతెచ్చుకొని ,హీరో గా ఎదిగిన సునీల్ .. ప్రస్తుతం విజయాలు లేక హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అటువంటి సమయంలో అద్భుతమైన రోల్ పట్టేశారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ లో ఓ కీలక రోల్ ఉంది. దానికి  ముందు  నారా రోహిత్ ని అనుకున్నారు. ఎన్టీఆర్, నారా రోహిత్ కలిసి నటిస్తే సినిమాపై అంచనాలు పెరిగిపోతాయని చిత్ర యూనిట్ భావించింది.

ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ ఆ రోల్ సునీల్ కి వరించినట్లు తెలిసింది. దీంతో నటుడిగా సునీల్ రీ ఎంట్రీ ఓ రేంజ్ లో ఉండబోతుందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ కుటుంబ కథ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ 25 వ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అజ్ఞాతవాసి అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ తర్వాతఎన్టీఆర్  మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus