గుంటూరు మిర్చి లాంటి అమ్మాయి ఉపద్రష్ట సునీత. గాయనిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆమె గురించి మీకు తెలియని కొన్ని నిజాలు…
1. గులాబీ లాంటి పాటసునీత 16 ఏళ్ల వయసులో గులాబీ సినిమా(1995)లో “ఈ వేళలో నీవు ఏమి చేస్తుంటావు” అనే పాట పాడారు. తొలి పాటతోనే యువతకు దగ్గరయ్యారు.
2. రేడియోలో స్వరంమూడేళ్ల నుంచే వేదికలపై పాడే సునీత చిన్నప్పుడే ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమాలు చేశారు. ఇప్పటి వరకు 500 ప్రోగ్రామ్స్ కు గొంతునిచ్చారు.
3. పిల్లలు రెండు కళ్లుసునీతకు కెరీర్ మొదలైన సమయంలోనే 19 ఏళ్లకే కిరణ్ తో పెళ్లి జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. కొడుకు ఆకాష్ (17), కూతురు శ్రేయ (14). భాద్యతగా వ్యవహరించని, మానసికంగా వేధించే భర్తను వదిలి సునీత స్వతంత్రంగా జీవిస్తున్నారు.
4. వెండి తెర ప్రవేశంనటిగా ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా సునీత తిరస్కరించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన అనామిక సినిమాలో కొంత సేపు కనిపించారు.
5. కమ్మగా చేతి వంటసునీత కమ్మగా పాడడమే కాదు వంటలు కూడా అంతే చక్కగా చేయగలరు. మామిడికాయ పప్పు, కాకరకాయ ఫ్రై, వంకాయ కూరలు వండండంలో నేర్పరి. పూర్తి వెజిటేరియన్.
6. గొంతు అరువుజ్యోతిక , అనుష్క , భూమిక , ఛార్మి , లైలా, మీరా జాస్మిన్, సౌందర్య, సోనాలి బిన్ద్రే, రిచా గంగోపాధ్యాయ్ ,శ్రియ, జెనీలియా, స్నేహ, కత్రినా కైఫ్ , ఇలియానా, తమన్నా, త్రిష, కమిలిని ముఖర్జీ, నయనతార తదితర ఎంతో మంది హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పారు. ఇలా 750 సినిమాల్లో తారలకు వాయిస్ అరువు ఇచ్చారు. శ్రీ రామ రాజ్యం సినిమాకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు.
7. వందల స్టేజీ షోస్మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సునీతకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటివరకు విదేశాల్లో 600 స్టేజీ షోస్ ఇచ్చారు.
8. అవార్డుల పంటసునీత తన 21 ఏళ్ల కెరీర్ లో మూడు భాషల్లో 3000 వేలకు పైగా పాటలు పాడారు. రెండు ఫిలిం ఫెర్ అవార్డులు అందుకున్నారు. తొమ్మిది సార్లు నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
9. బుల్లి తెరపై యాంకరింగ్టెలివిజన్ ఛానళ్లలోమ్యూజిక్ బేస్డ్ కార్యక్రమాలు చేశారు. జెమినీ టీవీలో నవరాగం, ఈటీవీలో ఝుమ్మంది నాదం, సప్త స్వరాలు, మాటీవీలో సూపర్ సింగర్స్, జీ తెలుగులో సరిగమప లిటిల్ చాంప్స్ షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు.
10. పవర్ స్టార్ పిన్నిపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాలో సునీత నటించనున్నారని తెలిసింది. పవన్ కి పిన్నిగా కనిపించనున్నారని సమాచారం.