8 ఏళ్లలో.. మహేష్ ఎంతలా మారాడో..!

సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్న కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ తోనే హిట్ అందుకున్నాడు. ‘మురారి’ ‘ఒక్కడు’ చిత్రాలతో మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ‘అతడు’ ‘పోకిరి’ చిత్రాలతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా… నెంబర్ వన్ రేసింగ్ హీరో. ఇది పక్కన పెడితే… కెరీర్ మొదట్లో ఈయన ఎక్కువగా బయట ఫంక్షన్లలో కనిపించే వాడు కాదు. ఇంకా చెప్పాలంటే.. తన సినిమాల ఫంక్షన్స్ కి తనే హాజరయ్యేవాడు కాదు. కాని 2012 నుండీ సోషల్ మీడియాలో … తన ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండడం మొదలు పెట్టాడు.

మిగిలిన హీరోల సినిమాలు… అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా .. ట్వీట్ చేసే వాడు. ఇక అవార్డు ఫంక్షన్ లకి అలాగే తన సినిమాల విజయోత్సవ ఫంక్షన్స్ కి హాజరయ్యేవాడు. ఇక ఇప్పుడైతే తన సినిమాలకి మిగిలిన హీరోలను కూడా ఆహ్వానిస్తూ వస్తున్నాడు. ఈ జనరేషన్ లో మొదటి మల్టీ స్టారర్ లో నటించాడు. ఓ రకంగా అక్కడి నుండీ మల్టీ స్టారర్స్ జోరు పెరిగిందని చెప్పాలి. ఇక ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ లతో ఎంతో స్నేహంగా ఉంటూ వస్తున్నాడు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆయన కొరటాల దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ లో కూడా 30 నిమిషాల పాత్ర చేయడానికి రెడీ అయ్యాడు మహేష్. ఈ 8 ఏళ్లలో తన అభిమానులని మాత్రమే కాదు మిగిలిన హీరోలను కూడా అలరిస్తున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఎంతో మంది ప్రాణాల్ని కూడా కాపాడాడు మహేష్. అయితే ఆ రికార్డులు, కలెక్షన్ లు అంటూ డబ్బా కొట్టుకోకుండా ఉంటే.. మహేష్ ను ట్రోల్ చేసే వారి సంఖ్య కూడా తగ్గే అవకాశాలు ఉంటాయనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. మహేష్ రేంజ్ కి… సూపర్ స్టార్ ట్యాగ్ కు హుందా తనం మైంటైన్ చేస్తే బాగుంటుంది అనేది వారి అభిప్రాయం కావచ్చు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus