Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు దర్శకులతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నుండి కొంత ఫ్యాన్సీ అమౌంట్ ను అడ్వాన్స్ గా తీసుకున్నారు. కానీ సరైన కథ సెట్ అవ్వడం లేదు. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేసిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) రజినీకాంత్ కి (Rajinikanth) తెగ నచ్చేసింది. అదే కథ తాను చేసుంటే బాగుణ్ణు అని ఆయన కోరుకున్నారు. ఒక దశలో తమిళంలో ఆ సినిమాని రజినీతో గోపీచంద్ మలినేని రీమేక్ చేస్తారని కూడా వార్తలు వినిపించాయి.

Rajinikanth

తర్వాత అలాంటిదేమీ జరగలేదు. కానీ గోపీచంద్ మలినేని వద్ద ఉన్న మరో పవర్ఫుల్ కథ రజినీకాంత్ వినడం జరిగింది. కానీ ఎందుకో అది రజినీకాంత్ ను ఎక్సైట్ చేయలేదు. అటు తర్వాత దర్శకుడు బాబీని (K. S. Ravindra) కూడా రజినీకాంత్ వద్దకు పంపి ఓ కథ వినిపించారు.దానికి కూడా రజినీకాంత్ ఇంట్రెస్ట్ చూపించలేదు. తాజాగా దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) వద్ద ఉన్న ఓ కథని కూడా రజినీకి వినిపించమని మైత్రి వారు అతన్ని చెన్నై పంపించారట.

వివేక్ ఆత్రేయ చెప్పిన కథకి రజినీకాంత్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తుంది. అయితే తన ఇమేజ్ కి తగ్గట్టు రజినీకాంత్ కొన్ని మార్పులు సూచించారట. వివేక్ వాటిపై వర్క్ చేసి.. బౌండ్ స్క్రిప్ట్ తో రజినీని మెప్పిస్తే… ఈ కాంబో సెట్ అయిపోయినట్టే..! ‘సరిపోదా శనివారం’ తో (Saripodhaa Sanivaaram) వివేక్ మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించాడు.

విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus