Surekha Vani: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. సురేఖ వాణి ఎమోషనల్!

  • May 1, 2023 / 11:10 AM IST

తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి ఈమధ్య కాలంలో సినిమాలను కాస్త తగ్గించిందని చెప్పాలి. ఈమెకు అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉన్నారా లేక నిజంగానే సినిమాలకు దూరమయ్యారో తెలియదు కానీ వెండి తెరపై సురేఖ వాణి హడావిడి కాస్త తగ్గిందని చెప్పాలి. ఇలా వెండితెరకు ఈమె దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె చేసే రచ్చ మామూలుగా లేదు.

తన కుమార్తె సుప్రీతతో కలిసి పొట్టి దుస్తులు ధరిస్తూ సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్ల హంగామా మామూలుగా లేదు హీరోయిన్లకు మించి వీరిద్దరూ సందడి చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.ఇకపోతే తాజాగా సురేఖ వాణి తన పుట్టినరోజును జరుపుకున్నారు. తన కుమార్తె సుప్రీత సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలను సురేఖ వాణి ఘనంగా జరుపుకున్నారు.

ఈ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లోనే సురేఖ వాణి కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే తన భర్త సురేష్ తేజ ఫోటోని పక్కన పెట్టుకొని సురేఖ వాణి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలోని తన భర్తను తలుచుకుంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. పుట్టినరోజుకు సంబంధించిన ఫోటో వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ…నా కళ్ళల్లో ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవనే బాధ నాలో ఎక్కువగా ఉంది.కానీ నువ్వు చూపించిన ప్రేమ నీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి.నా ప్రతి పుట్టినరోజు నువ్వు చేసే హంగామా ఇప్పటికి నాకు గుర్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా లవ్ యు ఫరెవర్ అంటూ ఈ సందర్భంగా సురేఖ వాణి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.


ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus