ఎన్నో చిత్రాల్లో అక్క, వదిన, అత్త, పిన్ని వంటి పాత్రలు పోషించిన సురేఖ వాణి అందరికీ సుపరిచితమే. ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. కానీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే సురేఖా వాణికి సోషల్ మీడియాలో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అలాగే పెళ్లీడుకు వచ్చిన కూతురు కూడా ఉంది. ఆమె పేరు సుప్రీత. ఈ తల్లీ కూతుర్లు కలిసి పార్టీలకు వెళ్లడం, సెలబ్రెషన్స్ లో పాల్గొనడం, వెకేషన్స్ కి వెళ్లడం..
ఆయా వేడుకలకు సంబంధించిన హాట్ డాన్స్ వీడియోలు, ఫోటోలు షేర్ చేయడంతో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యారు. కావాల్సిన గ్లామర్ షో చేస్తూ ఉంటే యూత్ కనెక్ట్ కాకుండా ఉంటారా అందుకే ఈ తల్లీ కూతుర్లు ఎటువంటి ఫోటో, వీడియో పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. ఇదిలా ఉండగా.. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా సురేఖ వాణి.. బీచ్ లో తన కూతురుతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది.
ఈ ఫొటోలో సుప్రీత చాలా గ్లామర్ గా ఉంది. వర్ణించడానికి మాటలు లేవు కాబట్టి ఫోటోని చూసుకోండి. ఇక ఈ ఫోటోకి కొన్ని మంచి కామెంట్స్ ను కూడా జత చేసింది సురేఖ వాణి. అందులో హ్యాపీ వాలెంటైన్స్ డే గైస్, మీ జీవితాన్ని ప్రేమ కోసం పాడు చేసుకోకండి’ అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. ఓ పక్క కూతురి గ్లామర్ యాంగిల్ ను చూపించి మరోపక్క మెసేజ్ ఇవ్వడంతో సురేఖా వాణి ఫోటో చర్చనీయాంశం అయ్యింది.