సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.తన కుమార్తె సుప్రీతతో కలిసి ఈమె చేసే డాన్స్ వీడియోలు ఓ రేంజ్ లో అభిమానులను సందడి చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సురేఖ వాణి ఎక్కువగా వైయస్ షర్మిల పై ఎక్కువగా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తోంది.
అయితే షర్మిలని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉన్నటువంటి షర్మిల మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై సురేఖ వాణి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒకసారిగా ఈ రీల్స్ వైరల్ అవుతున్నాయి. పాదయాత్ర అంటే పాదాలమీద నడిచే యాత్ర’.. ఆడబిడ్డ అని ఎందుకు అంటారంటే ఆడబిడ్డ కాబట్టి..
స్టూడెంట్స్ అని ఎందుకు అంటారు వారు యువత కాబట్టి లాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సురేఖ వాణి షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు స్టూడెంట్స్ అని ఎందుకు అంటారు అంటే వారు యువత కాబట్టి అని వ్యాఖ్యలకు సంబంధించి రీల్స్ చేశారు. ఇక ఈ వీడియోలోనే డీజే టిల్లు డైలాగ్స్ సెటైరికల్ గా పెట్టింది. నీకు దండం పెడతా.. నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ మాట్లాడు రాధిక..
నాకు టిపికల్ యాంగ్జైటీ వస్తోంది అని డైలాగ్స్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ ఈ వీడియో పై యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి సురేఖ వాణి తీరు చూస్తుంటే ఈమె వైయస్ షర్మిలను టార్గెట్ చేశారని తెలుస్తుంది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?