గేటు దూకి సూర్య ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ?

కుర్రవయసులో చాలామంది కాలేజీ బంక్ కొట్టడానికి.. తమ అభిమాన హీరో సినిమా టికెట్ కోసం.. ఇలా ఏదొక సందర్భంలో గేటు దూకుతుంటారు. స్టార్ హీరో సూర్య  కూడా గేటు దూకి పారిపోయారు. అయితే ఇది సూర్య కాలేజీ డేస్ లో జరిగిన సంఘటన కాదు. తాజా బ్రేకింగ్ న్యూస్ ఇది. సినిమాలో ఛేజింగ్ సీన్ లో నటించే మాదిరిగా సూర్య రియల్ లైఫ్ లో ఎందుకు గేటు దూకి పారిపోవాల్సి వచ్చిందంటే… తమిళ హీరో సూర్య విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేశారు. ఇది తెలుగులో గ్యాంగ్ గా  జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. హీరోయిన్ గా కీర్తి సురేష్, కీలక పాత్రలో రమ్య కృష్ణ నటించిన ఈ మూవీ తెలుగు స్ట్రైట్ చిత్రాలను బీట్ చేస్తూ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారం కోసం సూర్య రాజమహేంద్రవరంలోని ఊర్వశీ థియేటర్‌కు వెళ్లారు.

దీంతో హీరోను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ బారులు తీరారు. బౌన్సర్లు, పోలీసులు ఉన్నప్పటికీ అభిమానులను కట్టడి చేయలేకపోయారు. అభిమానులు చుట్టుముట్టే సరికి సినిమా హాల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉక్కిరిబిక్కిరైన సూర్య ఏం చేయాలో దిక్కుతోచక ఏకంగా హీరో స్టైల్లో గేటు దూకి బయటికి వచ్చి కారులో హైదరాబాద్ కి తిరుగు పయనమయ్యారు. గేటు దూకి పారిపోతున్న సూర్యను అక్కడే ఉన్న ప్రెస్ కెమెరామెన్లు ఫొటోల్లో బంధించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సూర్య ఫీట్స్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus