వచ్చే నెలలో ‘సింగం’గా బాక్సాఫీస్ వద్ద జూలు విదిలించనున్నాడు సూర్య. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులను జరుపుకుంటోంది. సూర్య నటుడిగా కెరీర్ మొదలుపెట్టినప్పటినుండి స్టార్ హీరోగా మారిన నేటి రోజుల వరకూ ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా స్పీడ్ పెంచేశాడు. ఇటీవల ప్రకటించిన విగ్నేష్ శివన్ సినిమాని తాజాగా సెట్స్ మీదికి తీసుకెళ్లిన సూర్య మరో రెండు సినిమాలను క్యూలో పెట్టేశాడు.
కొన్నాళ్లుగా పరాజయాలతో దారిలో పయనిస్తున్నారు విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్. ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ దర్శకుడు ‘ఇరండామ్ ఉలగం’ (తెలుగులో వర్ణ) సినిమాతో భారీ పరాజయాన్ని చవి చూశాడు.ఈ పరిస్థితుల్లో సూర్య, సెల్వ రాఘవన్ తో సినిమా చేస్తుండటం విశేషం. అయితే జయాపజయాలకు అతీతంగా సెల్వతో జోడీ కట్టిన సూర్య తానే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రస్తుతం సెల్వ రాఘవన్ ఎస్ జె సూర్య, రెజీనా, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో ‘నెంజమ్ మారప్పతిల్లై’ తెరకెక్కిస్తున్నారు. అయితే సూర్య ఇప్పుడు చేస్తున్న విగ్నేష్ శివన్ సినిమాతో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. గౌతమ్, రాఘవన్ సినిమాల్లో ఏది ముందు పట్టాలెక్కుతుందన్నది తెలియాల్సి ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.