కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా విడుదలైనా కూడా తమిళనాడులో దాదాపు రజినీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల రేంజ్ లోనే హడావుడి కనిపిస్తుంటుంది. ఇక అభిమానులపై నిజమైన ప్రేమను చూపించే అతి తక్కువ హీరోల్లో సూర్య ఒకరు. చాలా వరకు సినిమాల రిలీజ్ లు ఉన్నప్పుడే అభిమానులపై ప్రేమను చూపించే హీరోలు చాలా మంది ఉంటారు. కానీ సూర్య అలాంటి హీరో కాదు.
అగారం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల అభిమాని పెళ్లికి వెళ్లి సూర్య అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. సూర్య పెళ్లికి వస్తాడని ఎవరు కూడా ఊహించలేదు. ఆల్ ఇండియా సూర్య ఫ్యాన్స్ క్లబ్ లో కీలక వ్యక్తి అయిన సూర్య అభిమాని హరి ఇటీవల పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలన సూర్య రాడేమో అనుకోని డైరెక్ట్ గా వెళ్లి ఇన్వైట్ చేయకుండా క్లబ్ సభ్యుల ద్వారా సమాచారం ఇచ్చారట.
దీంతో సూర్య ముందస్తు సమాచారం ఇవ్వకుండా హరి పెళ్లిలో ప్రత్యక్షమయ్యాడు. తన చేతుల మీదుగా తాళి బొట్టును అందించి చివరి వరకు పెళ్లి పెద్దగా అక్కడే ఉన్నాడట. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.