సూర్య నటించిన “గ్యాంగ్” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

గ‌జ‌ని తో త‌మిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్‌డ‌మ్ ని పెంచుకుని త‌రువాత వ‌చ్చిన సింగం సీక్వెల్స్ తో వ‌రుస విజ‌యాలు సాధించి టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ ట్రేడ్ బిజినెస్ ని సెట్ చేసుకున్న‌ స్టార్ హీరో సూర్యకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగాచెప్పక్కర్లేదు. సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ అంతే భారీగా విడుదలౌతాయి. తాజాగా జ్ఞానవేళ్ రాజా నిర్మాతగా సూర్య కథానాయకుడిగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందించిన “తాన సెరంధ కూటమ్” అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మక నిర్మాణ‌సంస్థ యు. వి. క్రియేషన్స్ బ్యానర్లో “గ్యాంగ్” పేరుతో స‌క్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వరి 12న భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవ‌లే విడుద‌ల‌ చేశారు. ఇప్ప‌డు ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. విడుద‌ల చేసిన కొన్న గంట‌ల్లోనే హ్యూజ్ గా మిలియ‌న్ వ్యూస్ చూడ‌టం.. రెండు ల‌క్ష‌ల లైక్స్ రావ‌టం విశేషం. అంతేకాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండింగా గా నిల‌వ‌టం యూనిట్ మెంబ‌ర్స్ ఆనందంగా వున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భాహుబ‌లి లాంటి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్న ర‌మ్య‌కృష్ణ మ‌రియు కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ స‌న్సెష‌న్ అనిరుథ్ సంగీతమందించారు. జనవరి 12, 2018న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశి ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు ప్రమోద్, వంశి మాట్లాడుతూ…. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సూర్యకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన తమిళంలో విగ్నేష్ దర్శకత్వంలో నటించిన చిత్రాన్ని తెలుగులో గ్యాంగ్ పేరుతో మా యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీగా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఆక‌ట్టుకుందో దాన్ని మించి ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. ఫస్ట్ టైం టీజ‌ర్ లో సుర్య గారు తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌టం తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఆయ‌న మాట‌లు చాలా ముద్దుగా వుండ‌టంతో టీజ‌ర్ ని రిపీట్ మెడ్ లో చూస్తున్నారు. అనిరుధ్ సంగీతమందించిన పాటలు చాలా బాగా వచ్చాయి. కీర్తి సురేష్ నటన హైలైట్ గా నిలుస్తుంది. కార్తిక్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపిస్తారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus