Surya, Prabhas: ప్రభాస్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌పై సూర్య కామెంట్స్‌ వైరల్‌!

ప్రభాస్‌ మంచి ఫూడీ.. నచ్చిన ఆహారాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా బాగా తింటాడు. అంతేకాదు తన వాళ్లకు అంతే ప్రేమగా మనసు నిండా భోజనం పెడతాడు. ఒక్కోసారి అయితే ప్రభాస్‌ మీద కోపం వచ్చేంతగా ఫుడ్‌ పెడతాడు. ఈ మాటలు మేం చెప్పేది కాదు. ఆయనతో కలసి పని చేసిన హీరోయిన్లు, నటులు చెప్పినవే. ప్రభాస్‌తో సినిమా మొదలైందంటే చాలు.. ఒకట్రెండు రోజుల్లో ఫుడ్‌ ఫెస్టివల్‌ పక్కా అని అంటుంటారు. ఆ ఫొటోలతో సోషల్‌ మీడియాలో సందడిగా మారిపోతుంది.

ప్రభాస్‌ ఫుడ్‌ ప్రేమ వెనుక దివంగత కృష్ణంరాజు ఉన్నారనే విషయం తెలిసిందే. ఇంటికి వచ్చినవాళ్లకు కడుపు నిండా, మనసు నిండా ఫుడ్‌ పెట్టనిదే వాళ్ల కుటుంబం ఒప్పుకోదు. అంతేకాదు డిన్నర్‌కి ఆహ్వానించినాక అతను వచ్చినంతవరకు తినకుండా అలానే వెయిట్‌ చేయడం కూడా ప్రభాస్‌కు అలవాటు అట. ఈ విషయాన్ని ప్రముఖ కథానాయకుడు సూర్య చెప్పారు. గతంలో ఓ సందర్భంలో ఆయనకు ప్రభాస్‌ దగ్గర ఎదురైన స్వీట్‌ మెమొరీని షేర్‌ చేసుకున్నారు సూర్య. కొన్ని రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్, సూర్య సినిమాల చిత్రీకరణ పక్కపక్కనే జరిగిందట.

అలా ఓ రోజు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు, సూర్యను ప్రభాస్ డిన్నర్‌కు ఆహ్వానించారట. అప్పుడే ప్రభాస్‌ ప్రేమ, గౌరవం, మర్యాద ఏంటో తెలిసింది అని చెప్పారు సూర్య. “ఓ రోజు ప్రభాస్ నన్ను డిన్నర్ కు ఆహ్వానించారు. నా షూటింగ్ రాత్రి 8 గంటలకు పూర్తయిపోవాలి. దీంతో ఆ తర్వాత వస్తా అని చెప్పారు. కానీ ఆ రోజు షూట్‌ ఆలస్యమై రాత్రి 11.30 వరకు జరిగింది. దీంతో ప్రభాస్ వెళ్లిపోయి ఉంటాడనుకున్నా. కానీ ప్రభాస్‌ ఆ టైమ్‌ వరకు నా కోసం వెయిట్‌ చేశాడు’’ అని సూర్చ చెప్పాడు.

‘‘నేను నా రూమ్‌ దగ్గరకు వెళ్లగానే లోపలి నుండి ప్రభాస్‌ వచ్చి ఫ్రెష్‌ అయ్యి రండి డిన్నర్‌ చేద్దాం అన్నాడు. దాంతో నేను షాక్ అయ్యాను. రాత్రి 11.30 వరకు ప్రభాస్ నా కోసం డిన్నర్ చేయకుండా ఉన్నాడా? అనుకున్నాను. నేను స్నానం చేసి వెళ్లాక చూస్తే.. వాళ్ల ఇంటి నుంచి తెప్పించిన వంటకాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్ అమ్మగారు చేసిన బిర్యానీ తిన్నాను.. అద్భుతం అంతే’’ ఆ రోజు ఫుడ్‌ ఫెస్టివల్‌ గురించి చెప్పాడు సూర్య. అదే మరీ డార్లింగా మజాకా?

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus