హీరోగా వరుసగా సినిమాలు చేసినా.. సరైన విజయాలు అందుకోలేకపోయాడు సుశాంత్. ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి… ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో నటుడిగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘రావణాసుర’లో విలనీ స్టైల్ రోల్ వేశాడు. ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమాతో మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా 11న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో చిరంజీవితో కలసి నటించడం గురించి మాట్లాడాడు.
‘భోళా శంకర్’ సినిమాలో గతంలో వచ్చిన పుకార్లకు తగ్గట్టే సుశాంత్ (Sushanth) తన పాత్ర గురించి చెప్పాడు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ కనిస్తుందని, ఆమెకు జోడీగా తాను కనిపిస్తానని చెప్పాడు. చిరంజీవి ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తారని సుశాంత్ చెబుతూ.. ఓ సన్నివేశంలో తాను కారు దిగుతుంటే చిరు డోర్ తీయాలని.. కానీ, అలా ఆయన చేయడం బాగోదేమో అనుకుని… తానే డోర్ తీసుకొని బయటకొచ్చేశాడట.
అప్పుడు చిరంజీవి ‘నువ్వు చేసిన పనిలో నీ గౌరవం కనిపిస్తోంది. కానీ సీన్ ప్రకారం నేనే డోర్ తీయాలి అని అన్నారట. అలా సీన్ పూర్తి చేశారట. ఇక ఈ సినిమాలో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్.. ఇలా మొత్తం మెయిన్ టీమ్‌తో ఓ పాట ఉంటుంది. ఆ పాట గురించి కూడా సుశాంత్ చెప్పుకొచ్చాడు. పాట అని చెప్పగానే శేఖర్ మాస్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడట సుశాంత్. అప్పటికే డ్యాన్స్ చేసి చాలా రోజులైపోవడంతో బాడీ ఫ్రీ అవ్వాలని శేఖర్ మాస్టర్ టీమ్‌తో రెండు గంటలు ప్రాక్టీస్ చేశాడట.
సెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేశాడట. అయితే ఆ టైమ్‌లో చిరంజీవి ప్రశాంతంగా కూర్చొని మైండ్‌లోనే ప్రాక్టీస్ చేసేస్తున్నారని సుశాంత్ చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమా గురించి చూస్తే.. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది. మెహర్ రమేశ్ ఈ సినిమాకు దర్శకుడు. ఆయన చాలా రోజుల తర్వాత మెగా ఫోన్ పట్టుకుని ఈ సినిమా చేసిన విషయం తెలిసిందే.