Sushmita Sen: లలిత్ మోడీ కంటే ముందు ఆ 9 మందితో సుస్మితా సేన్ డేటింగ్ చేసిందట..!

బాలీవుడ్‌లో సుష్మితా సేన్‌ డేటింగ్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. తనకంటే 13 ఏళ్ళు పెద్దవాడైన లలిత్‌ మోడీతో ప్రేమ వ్యవహరం నడపడం పై నలుగురు నాలుగు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ లలిత్‌ మోడీ’ తన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. చాలా కాలం క్రితమే వీరికి పరిచయం ఏర్పడిందట.

కానీ ఇప్పుడు ప్రేమ ఏంటనేది అందరి మైండ్లో మెదులుతున్న ప్రశ్న.అందుకే సోషల్ మీడియాలో వీరి ప్రేమ గురించి చర్చలు జరుగుతున్నాయి.నెటిజన్లు ట్రోలింగ్ చేసినా సుస్మిత లెక్క చేసే వ్యక్తి కాదు.గతంలో 15 ఏళ్ల చిన్నవాడితో కూడా ఆమె సహాజీవనం చేసింది.ఇప్పుడు లలిత్ మోడీతో కలిపి మొత్తం 10 మందితో ఈమె ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తుంది. క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌, నటుడు రణ్‌దీప్‌ హుడా, డైరెక్టర్‌ విక్రమ్‌ భట్‌, ముద్దాసిర్‌, మానవ్‌ మీనన్‌ వంటి బడా సెలబ్రిటీలతో కొన్నాళ్ళపాటు డేటింగ్ చేసిన ఈమె అటు తర్వాత కూడా పెద్ద పెద్ద బిజినెస్ మెన్ లు అయిన రితిక్‌ ఖాసిన్‌, సబీర్‌, సంజయ్‌ నారంగ్‌, ఇంతియాజ్‌లతో కూడా సహజీవనం చేసింది.

చివరికి లలిత్ మోడీ వద్దకి వచ్చింది ఈమె. ఇక్కడైనా ఆగుతుంది అనే నమ్మకం లేదు అంటున్నారు నెటిజన్లు. ఆమె మాజీ ప్రియులు కూడా ఇవే కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు సుష్మితా వయసు 46 కాగా.. లలిత్‌ మోదీ వయసు 58,59 ఉంటుందని తెలుస్తుంది. సుష్మితకి పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వారిని ఆమె దత్తత తీసుకుంది లెండి.ఉన్న మాట చెప్పుకోవాలి కాబట్టి ఈమె సోషల్ సర్వీసులు కూడా ఎక్కువగానే చేస్తుంది అని చాలా మంది సెలబ్రిటీలు చెబుతుంటారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి ఈమె సాయం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయట.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus