‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) తర్వాత హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) , దర్శకుడు హసిత్ గోలి (Hasith Goli) కాంబినేషన్లో ‘శ్వాగ్’ (Swag) వచ్చింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. రీతూ వర్మ (Ritu Varma) , దక్ష నగార్కర్ (Daksha Nagarkar) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్(Meera Jasmine) , శరణ్య ప్రదీప్ (Saranya pradeep)..లు కీలక పాత్రలు పోషించడం జరిగింది. టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే కారణంగా ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ కాలేకపోయారు.
దీంతో బాక్సాఫీస్ వద్ద ‘శ్వాగ్’ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.53 cr |
సీడెడ్ | 0.15 cr |
ఉత్తరాంధ్ర | 0.26 cr |
ఈస్ట్ | 0.09 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.14 cr |
కృష్ణా | 0.22 cr |
నెల్లూరు | 0.06 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.30 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.80 cr (షేర్) |
‘శ్వాగ్’ చిత్రానికి రూ.5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.4.7 కోట్ల దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది ‘శ్వాగ్’ .