కుటుంబ కథ చిత్రంతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… ఎపిసోడ్ ప్రారంభంలోనే డిజైనర్ శృతికి కావ్య ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన శృతి నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం ఇంతలోనే మీరే ఫోన్ చేశారని చెబుతుంది. ఏమైందని కావ్య అడగడంతో పులి రక్తానికి మరిగినట్టు రాజ్ సర్ మీ డిజైన్స్ తప్ప నేనేం వేసిన ఇష్టపడటం లేదని చెబుతుంది.
ఈ విషయం గురించి మిమ్మల్ని అడుగుదామనుకున్నా కానీ మీరేమనుకుంటారోనని ఆగిపోయాను ఇంతలోనే మీరే ఫోన్ చేశారని శృతి చెపుతుంది. ఇక నేను మీకు హెల్ప్ చేయాలంటే కొన్ని కండిషన్స్ తప్పకుండా ఉంటాయి నేను ఆఫీసుకు రాను నాకు మంత్లీ శాలరీ వద్దు డిజైన్ కి ఇంత అని ఇస్తే చాలు కానీ నేను వేస్తున్నట్టు మీ సార్ కి తెలియకూడదని కావ్య చెప్పగా మీరు బాగా కోటీశ్వరులు కదా మీకు డబ్బు అవసరం ఏంటి అని శృతి ప్రశ్నిస్తుంది.
నేను కోటీశ్వరుల ఇంటికి కోడలిని నేను అడిగితే రాజ్ ఎంతైనా ఇస్తారు కానీ నేను మా తల్లిదండ్రులకు సహాయం చేయాలనుకుంటున్నాను అందుకే తనని అడగడం ఇష్టం లేదని కావ్య చెబుతుంది.ఇక రేపు డిజైన్స్ పంపిస్తానని చెప్పడంతో లేదు ఇప్పుడే పంపించు రాత్రికే వేస్తానని కావ్య చెబుతుంది ఇక రాజ్ పడుకుంటేనే తన పని జరుగుతుందని భావించిన ఈమె తనని పడుకోమని చెబుతుంది.
తను నిద్రపోకపోవడంతో కావ్య తాను నిద్రపోయినట్టు యాక్ట్ చేసి రాజ్ పడుకున్న తర్వాత డిజైన్స్ వేయడానికి బయటకు వెళుతుంది. అర్ధరాత్రి మెలకువ వచ్చిన రాజ్ అక్కడ కావ్య లేకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని ఇల్లు మొత్తం వెతుకుతాడు అయితే బయట డిజైన్స్ వేయడం చూసి షాక్ అవుతాడు దగ్గరకు వెళ్లి కావ్య వేస్తున్నటువంటి డిజైన్స్ లాక్కుంటారు అయితే రాజ్ ఉన్న విషయాన్ని ముందుగా గమనించిన ఈమె పైన ముగ్గులు వేస్తున్నటువంటి పేపర్ పెడుతుంది
అది చూసిన రాజ్ ఈ ముగ్గు వేయడం కోసం ఇలా అర్ధరాత్రి ఇక్కడికి వచ్చావా అంటూ ఆమె మీద అరిచి వెళ్ళిపోతాడు. మరోవైపు అప్పు కళ్యాణ్ ను తాను తిట్టానని ఫీలయ్యాడేమో రేపు కబడ్డీ ప్రాక్టీస్ కి రాడు తనుకు సారి చెప్పాలి అంటూ మిస్సేడ్ కాల్ ఇస్తుంది. అది చూసిన కళ్యాణ్ సారీ చెప్పడానికి అయి ఉంటుందని ఫోన్ చేయడు మరోసారి ఫోన్ చేసిన అప్పు మిస్సేడ్ కాల్ ఇచ్చిన ఫోన్ చేయాలని తెలియదా అంటూ ఎడమడ కళ్యాణ్ ని తిట్టేస్తుంది.
దాంతో కళ్యాణ్ సారీ చెబుతాడు. ఇక మోడల్ గా యాడ్ చేయడం కోసం సెలెక్ట్ అయినందుకు స్వప్న ఎంతో సంతోషంలో తేలిపోతూ ఉంటుంది. అది చూసినటువంటి రాహుల్ సంతోషపడు నువ్వు ఈ యాడ్ చేసినట్టు మా ఇంట్లో వాళ్ళు కనుక చూస్తే మరో క్షణమే నిన్ను బయటకు తోసేస్తారు అంటూ సంబరపడుతుంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Brahmamudi) పూర్తి అవుతుంది.