Brahmamudi July 28th: అక్కాచెల్లెళ్ల మధ్య మొదలైన వార్… కావ్యను అవమానించిన స్వప్న!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ పొందుతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే…స్వప్న చేసిన బోల్డ్ యాడ్ కారణంగా దుగ్గిరాల కుటుంబ సభ్యులందరూ తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కనకం దంపతులు కూడా కోప్పడుతూ స్వప్నను కొట్టడానికి చేయి ఎత్తుతారు. అయితే తాను కడుపుతో ఉందని చెప్పి కనకం ఆగిపోతుంది.నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఈ ఇంట్లోకి అడుగు పెట్టావో మర్చిపోయావా మర్యాదగా చెప్పినట్టు వింటే విను లేదంటే కూతురు అని కూడా చూడను అంటు కూతురికి వార్నింగ్ ఇస్తుంది. అనంతరం సీతారామయ్య దంపతుల వైపు తిరిగిచేతుల జోడించి క్షమించమని వేడుకుంటుంది.

నేను ముగ్గురు కూతుర్లు పుడితే దీనిని గారాభం చేశాను అందుకే ఇలా తయారయింది. కావ్య కూడా నా కడుపున పుట్టింది అది మిమ్మల్ని ఎలా చూసుకుంటుందో మీకు తెలుసు అంటూ అవమానంతో బాధపడుతూ వారిని క్షమాపణలు వేడుకుంటుంది.కనకం మాటలకు సీతారామయ్య మాట్లాడుతూ తప్పు చేస్తే తప్పు మళ్లీ జరగకుండా చూసుకుంటాము కానీ వారిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసే కుటుంబం దుగ్గిరాల కుటుంబం కాదని చెబుతారు.ఆ మాటలకు కృష్ణమూర్తి ఈ గుడిలో ఉండే అర్హత మనకు లేదు వెళ్దాం పద కనకం అనడంతో అసలు ఏదో పనిమీద వచ్చారు అని సుభాష్ మాట్లాడతారు. కూతురు కడుపుతో ఉంది కదా అని తనకు చీర సారే తెచ్చామని చెబుతారు.

ఆ మాటలకు స్వప్న లేని కడుపుకు ఈ చీరసారే ఏంటో అని మనసులో అనుకుంటుంది. మరి కూతురికి చీర సారె తెచ్చి పెట్టకుండా వెళ్ళిపోతారా మీ చేతుల మీదుగానే జరగాలి అని చిట్టి చెప్పడంతో కృష్ణమూర్తి దంపతులు కూతురికి వడి నింపి తనని ఆశీర్వదిస్తారు.ఇక ఇంటికి వెళ్లిన కనకం అక్కడ జరిగిన విషయాలన్నింటిని చెప్పడంతో అప్పు దాని నెత్తిన బండ వేయకుండా అక్షింతలు వేసి వచ్చారా అంటూ స్వప్న పై మండిపడుతుంది దాంతో కనకం నువ్వు కూడా నీ డ్రెస్ మార్చుకోవాలి ఇలా మగ రాయుడిలా కాకుండా అమ్మాయిల డ్రెస్ వేసుకో అని చెప్పడంతో నేను ఎవరి కోసం మారని అప్పు వెళ్ళిపోతుంది.

మరోవైపు జరిగిన సంఘటన గురించి సీతారామయ్య దంపతులు బాధపడుతూ ఉండగా అది చూసిన కావ్య రాజ్ బాధపడతారు దాంతో కావ్య అక్క తరపున నేను క్షమాపణలు చెబుతున్నానంటుంది. అంతలోపు కావ్య స్వప్న వద్దకు వెళ్లి తనని తిడుతుంది. అబద్ధపు కడుపు అని చెప్పి ఇంటికి కోడలు అయ్యావు ఇప్పుడు ఆ విషయం బయటపడితే నీ పరిస్థితి ఏంటో తెలుసా జాగ్రత్తగా నడుచుకో అంటూ కావ్య చెప్పడంతో నీకెందుకు ఆ బాధ నువ్వు కేవలం రాజ్ భార్యగా మాత్రమే నీకు గుర్తింపు ఉంది. నేను ఒక మోడల్ అయ్యేసరికి నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు అంటూ మాట్లాడుతుంది.

నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఇంట్లో నుంచి కూడా బయటకు వెళ్లాల్సి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కావ్య చెప్పడంతో ముందు నీకు ఇంట్లో స్నానం ఏంటో అది గుర్తుంచుకో నీకు పనిమనిషి స్థానమే నీ భర్త నిన్ను భార్యగా గుర్తించలేదు మీ అత్త నిన్ను కోడలుగా గుర్తించలేదు అసలు నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావో వెళ్ళిపోతావో కూడా తెలియదు అంటూ స్వప్న కావ్యను దారుణంగా అవమానిస్తూ తనని బాధపెడుతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus