కలర్స్ స్వాతి చాలా రోజుల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు అయితే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి. తాజాగా నటుడు నవీన్ చంద్రతో కలిసి కలర్స్ స్వాతి నటించిన మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది. సెప్టెంబర్ 28వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకోవడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ మాట్లాడుతూ మా సినిమా పట్ల కొంతమంది చాలా మంచిగా రివ్యూ ఇచ్చారు. సినిమాలో ఎక్కడ ప్లస్ పాయింట్ అయింది. ఎక్కడ మైనస్ పాయింట్ అయింది అనే విషయాల గురించి బాగా రాశారు కానీ కొంతమంది మాత్రం అసలు సినిమా ఏ మాత్రం బాగోలేదంటూ వారికి నచ్చిన విధంగా రివ్యూ ఇచ్చారని ఇలా ఒక సినిమా చూడకుండా జడ్జి చేయడం మంచిది కాదు అంటూ మాట్లాడారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కలర్స్ స్వాతి (Swathi) మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొంతమంది జర్నలిస్టులు నా గురించి రాసినటువంటి వార్తలు చదివి నేను చాలా బాధపడ్డాను అని ఆ వార్తలు చూసి కుమిలిపోయానని ఈమె తెలియజేశారు. నటిగా నేను విమర్శలను ఎదుర్కొంటాను అది నా వృత్తిపరమైనటువంటి జీవితం వరకు మాత్రమే నేను విమర్శలను ఎదుర్కొంటాను కానీ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆ విమర్శలను తాను అంగీకరించలేనని తెలిపారు.
నా గురించి తప్పుడు వార్తలు రాయటం వల్ల నేనంటే ఏంటో తెలియని వారు ఆ వార్తలను చదివి అవి నిజమే కదా అనే అవగాహనకు వస్తారు. చాలామంది ఈ వార్తలను నమ్మారు అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే తట్టుకోగలం కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విమర్శలు చేసే తట్టుకోవడం చాలా కష్టం అంటూ ఈ సందర్భంగా కలర్స్ స్వాతి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!