Swimming-Pool Task: స్మిమ్మింగ్ పూల్ లో రెచ్చిపోయిన అమ్మాయిలు.! బిందుని ఎత్తుకున్నశివ..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో స్మిమ్మింగ్ పూల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకరి తర్వాత ఒకరు స్మిమ్మింగ్ పూల్ లో దిగి సాంగ్స్ వచ్చినప్పుడల్లా పెర్ఫామన్స్ ఇవ్వమని చెప్పాడు. ఇక్కడే అరియానా, అషూరెడ్డి, అఖిల్ తప్ప మిగతా అందరూ స్మిమ్మింగ్ పూల్ టాస్క్ చేశారు. అమ్మాయిల్లో ముఖ్యంగా తేజస్వి, బిందు, సరయు, మిత్రా రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా తేజస్వి సాంగ్స్ కి అనుగుణంగా డ్యాన్స్ చేసింది. స్మిమ్మింగ్ పూల్ లో దిగిన పైయిర్ గా బిందు ఇంకా శివ కూడా డ్యాన్స్ చేశారు.

Click Here To Watch Now

ఇక్కడే బిందుని తన భుజాలపై ఎత్తుకున్నాడు శివ. అంతకుముందు రోజు కూడా చిన్న బెడ్ పైన శివ పడుకోవాల్సి వచ్చినపుడు బిందు తనకి తోడుగా కింద పడుకుంది. ఇదే విషయాన్ని తేజస్వి , అషూరెడ్డి మాట్లాడుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు స్మిమ్మింగ్ పూల్ టాస్క్ లో కూడా ఇలా భుజాలపై ఎక్కించుకోగానే ఇద్దరి మద్యలో ఫ్రెండ్షిప్ ఎలా ఉందో హౌస్ మేట్స్ కి బాగా అర్దమైంది. ఇక బిందుకి సంబంధించిన విషయాలు ఏమీ కూడా శివ ముందర డిస్కస్ చేయరు.

అంతేకాదు, వీళ్లిద్దరూ ఒకరికొకరు నామినేట్ కూడా చేసుకోరు. ఈ విషయాన్ని హౌస్ మేట్స్ రెండోవారమే కనిపెట్టారు. ఇక స్మిమ్మింగ్ పూల్ లో అమ్మాయిలు రెచ్చి పోయి మరీ డ్యాన్స్ చేశారు. బయట ఉన్న అషూరెడ్డి అరియానా లు కూడా స్మిమ్మింగ్ పూల్ గట్టు దగ్గరకి వచ్చి కూర్చుని మరీ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ కి హెల్త్ బాగోని కారణంగా ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేయలేదు. ఇక అజయ్ తో కలిసి తేజస్వి హీరోయిన్ రేంజ్ లో రెచ్చిపోతూ స్టిల్స్ ఇచ్చింది.

ప్రతి సాంగ్ కి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ ఎంటర్ టైన్ చేసింది. ఇది టాస్క్ లాగా కాకుండా ఎంటర్ టైన్మంట్ వేలో సాగింది. చూసిన వాళ్లందరూ ఇదేం టాస్క్ రా బాబూ అన్నట్లుగా ఉంది. మార్నింగ్ అరియానా ఇంకా సరయుల చిన్నపాటి ఘర్షణ తర్వాత హౌస్ మేట్స్ అందరూ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తర్వాత కెప్టెన్ గా చైతూ అందరికీ పనిష్మెంట్స్ గురించి చెప్పాడు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus