మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో ‘SYG'(సంబరాల యేటి గట్టు) అనే పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రోహిత్ కెపి దర్శకుడిగా పరిచయమవుతూ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా హిట్ ఇచ్చిన ‘ప్రైమ్‌షో ఎంటర్టైన్‌మెంట్’ అధినేతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వారు గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తున్నారు. ఈరోజు సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘అసుర ఆగమన’ పేరుతో ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ ద్వారా ‘SYG'(సంబరాల యేటి గట్టు) వరల్డ్ ను పరిచయం చేశారు. దాదాపు 1:06 నిమిషాల నిడివి కలిగి ఉంది ఈ గ్లింప్స్. యుద్ధానికి సిద్ధమవుతున్న అసురుల నేపథ్యాన్ని ఇందులో చూపించారు. సాయి దుర్గ తేజ్ మేకోవర్ నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంది.బాలి అనే యోధుడి పాత్రలో అతను కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. అలాగే ఈ సినిమా కోసం బాడీని కూడా బిల్డ్ చేసి .. రగ్డ్ లుక్లోకి మారిపోయాడు తేజు.
సినిమాటోగ్రాఫర్ వెట్రివేల్ పలనిసామి అందించిన విజువల్స్ హైలెట్ గా నిలిచాయి. నిర్మాతలు పెడుతున్న భారీ బడ్జెట్.. ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. కథ పై ఈ గ్లింప్స్ లో ఎక్కువ హింట్ అయితే ఇవ్వలేదు. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. విజువల్స్ కే పెద్ద పీట వేశారు అని స్పష్టమవుతుంది. ఆలస్యం చేయకుండా ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి.