సినిమా వ్యక్తితో వద్దనుకునే అలా చేసిందట

టాలీవుడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చి… అదే రేంజిలో కొనసాగలేకపోయింది తాప్సి. వరుస సినిమా అవకాశాలు అందుకున్నా… అవి విజయం అందుకోక.. వెనుకబడిపోయింది. అయితే బాలీవుడ్‌ వెళ్లి చిన్న చిన్నగా కెరీర్‌ను నిలబెట్టుకుంటోంది. మరోవైపు కంగన రనౌత్‌తో టామ్‌ అండ్‌ జెర్రీ రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఈలోగా రిలేషన్‌షిప్‌లో ఉంటూ అచ్చ హిందీ బాలీవుడ్‌ హీరోయిన్‌లా కొనసాగుతోంది. తాజాగా తన రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడింది. తాప్సి చాలా రోజుల నంఉచి డెన్మార్క్‌ చెందిన మలియాస్‌ బోయ్‌ అనే షట్లర్‌తో రిలేషన్‌లో ఉంది.

ఈ విషయాన్ని ఆమెనే గతంలో ఓ సారి చెప్పింది. మొదటి నుంచి తాప్సికి రిలేషన్‌షిప్‌ విషయంలో స్పష్టత ఉందట. సినిమా నేపథ్యం ఉన్న వ్యక్తులను కాకుండా, ఇతర రంగాల్లోని వ్యక్తులతోనే రిలేషన్‌లో ఉండాలని అనుకుందట. అందుకు తగ్గట్టుగానే క్రీడా రంగంలో ఉన్న వ్యక్తితో అనుబంధంలో ఉంది. అయితే పెళ్లి విషయంలో అప్పుడే తొందరపడటం లేదు తాప్సి. దాని గురించి ఇప్పటికైతే ఎలాంటి ఆలోచన లేదని చెబుతోంది. తాప్సి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజియెస్ట్‌ హీరోయిన్‌.

‘రష్మీ రాకెట్’ అనే సినిమాలో షటిల్‌ ప్లేయర్గా నటిస్తోంది. దాంతోపాటు భారతీయ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌ ‘శభాష్‌ మిథు’ అనే సినిమా కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాల కోసం శిక్షణ తీసుకుంటూ… నటిస్తోంది. వీటితోపాటు ‘హసీన్ దిల్ రుబా’, ‘లూప్ లుపేట’ సినిమాల్లో సినిమాల్లో కూడా కనిపించనుంది. వీటితో బాలీవుడ్‌లో టాప్‌ ప్లేస్‌పై కన్నేసింది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus