టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన తాప్సీకి (Taapsee Pannu) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలకే పరిమితమయ్యారు. తాప్సీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే తాను ప్రీతి జింటాలా (Preity Zinta) ఉండటం వల్లే హీరోయిన్ గా సక్సెస్ అయ్యానని తాప్సీ అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. ప్రీతి జింటా న్యూ వెర్షన్ తాప్సీ పన్ను అని చాలామంది ఫీలవుతారని ఆమె పేర్కొన్నారు.
ప్రీతి ఎంతో పాజిటివ్ ఎనర్జీతో ఉంటారని తాప్సీ అభిప్రాయపడ్డారు. ప్రీతీ జింటాకు నేను ఎప్పటికీ చెడ్డ పేరును మాత్రం తీసుకొనిరానని తాప్సీ పన్ను పేర్కొన్నారు. ప్రీతి జింటాలా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటానని తాప్సీ పన్ను వెల్లడించారు. తాను ఇంజనీరింగ్ చదివానని చదువుకునే సమయంలోనే నాకు మూవీ ఆఫర్లు వచ్చాయని తాప్సీ పన్ను పేర్కొన్నారు. ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబాతో పాటు ఇతర ప్రాజెక్ట్ లలో ఆమె నటిస్తున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ పారితోషికం భారీ స్థాయిలోనే ఉంది. తాప్సీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీ అయితే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. తాప్సీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి కొత్త ఆఫర్లు రావడం అయితే సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాప్సీ వయస్సు ప్రస్తుతం 36 సంవత్సరాలు కాగా పెళ్లి తర్వాత ఆమె మరింత సంతోషంగా కనిపిస్తున్నారు.
తాప్సీ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే ఆమె సక్సెస్ రేట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తాప్సీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. వయస్సు పెరుగుతున్నా ఈ బ్యూటీ యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు.