Tamanna: తమన్నా బండారం బయటపెట్టిన పాత వీడియో.. వైరల్ అవుతున్న వీడియో..!

తమన్నా కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది తమన్నా చిన్నప్పటి వీడియో కావడం విశేషం. ఇంతకీ ఆ వీడియో ఎందుకంత వైరల్ అవుతుంది? అందులో ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే.. తమన్నా 2005లో ‘శ్రీ’ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికంటే ముందు హిందీలో ‘చాంద్ షా రోషన్ చెహర’ అనే సినిమాలో నటించింది. తమన్నా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన సమయంలో ఆమె వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే.

చాలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ. అయితే తాజాగా తన మొదటి హిందీ సినిమా ‘చాంద్ షా రోషన్’ గురించి తమన్నా మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. “ప్రస్తుతం నేను పదవ తరగతి చదువుతున్నాను. త్వరలోనే పరీక్షలు కూడా రాయబోతున్నాను” అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అయితే తన 13వ ఏటా తమన్నా ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు.

13 ఏళ్ల వయసులోనే తమన్నా (Tamanna) తన మొదటి సినిమాకు సైన్ చేసింది. కానీ ఈ సినిమా కాస్త ఆలస్యమవడంతో 15వ ఏటా తమన్నా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ వీడియోలో ‘నా వయసు కేవలం పదమూడున్నర ఏళ్లు మాత్రమే’ అని తమన్నా తెలిపింది. తమన్నా నార్త్ ఇండియన్ అనే విషయం తెలిసిందే. నిజానికి నార్త్ హీరోయిన్స్ చిన్న వయసులోనే కాస్త పెద్దగా కనిపిస్తుంటారు అనే అభిప్రాయం ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus