టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన కాజల్, తమన్నా దశాబ్దకాలం పై నుండే ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. ఒకానొక టైంలో ఇద్దరూ టాప్ ప్లేస్ లో కొనసాగేవారు. కానీ ఇప్పుడు కొత్త హీరోయిన్ల రాకతో.. వీరికి అవకాశాలు చాలా వరకూ తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి చేతిలో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్2’ ‘మోసగాళ్ళు’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. హిందీ లో ‘బోలె చుడియాన్’ అలాగే తెలుగులో ‘సీటిమార్’ వంటి చిత్రాల్లో నటిస్తుంది.
ఇప్పుడు అవకాశాలు లేకపోయినా విషయంలో వీరు అస్సలు తగ్గరు. ఇప్పటికీ 2 కోట్లు పైనే డిమాండ్ చేస్తూ దర్శక నిర్మాతల్ని పరుగులు పెట్టిస్తున్నారు వీరిద్దరూ. అందుకే మీడియం రేంజ్ హీరోయిన్లను తీసుకుని వారు బడ్జెట్ ను తగ్గించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ లాక్ డౌన్ టైంలో కూడా వీరిద్దరూ డబ్బులు సంపాదించుకోడానికి తహ తహ లాడుతున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుండీ ముంబై లోనే ఉంటూ వస్తున్న కాజల్, తమన్నా లు… కొన్ని యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు.
కరెంట్ బిల్లు, మొబైల్ బిల్లు లు చెల్లింపు కోసం ‘భారత్ బిల్ పే’ యాప్‌ను ఉపయోగించండి అంటూ కాజల్ ప్రమోట్ చేస్తుండగా.. మరోపక్క ‘ఎం.పి.ఎల్ గేమ్స్ యాప్’ ను ఉపయోగించి డబ్బులు సంపాదించవచ్చు అంటూ తమన్నా ఆ యాప్ ను ప్రమోట్ చేస్తుంది. తమన్నా రోజంతా ఎం.పి.ఎల్ లో మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉంటాను అని చెబుతుంది.
Most Recommended Video
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!