స్పెషల్ సాంగ్ కోసం తమన్నా రెమ్యునరేషన్ ఎంతంటే…!

  • September 16, 2017 / 01:06 PM IST

కమర్షియల్ సినిమాకి స్పెషల్ సాంగ్ ఇచ్చే కిక్కేవేరు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ రిపీట్ గా థియేటర్ కి రప్పించే అంశాల్లో ఇది ఒకటి. అందుకే ఫిలిం మేకర్స్ దీనిపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఎన్టీఆర్ గత చిత్రం జనతా గ్యారేజ్ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో ఐటెం సాంగ్ చేయించారు. బాబీ దర్శకత్వంలో తారక్ నటించిన జై లవకుశ లో మరో స్టార్ హీరోయిన్ తమన్నా తో “స్వింగ్ జరా” అనే స్పెషల్ సాంగ్ చేయించారు. అయితే మిల్కీ బ్యూటీ గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో చేసిన ఐటెం సాంగులకు 60  లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

మరి ఇప్పుడు ఈ పాటకి ఎంత తీసుకున్నారని తమన్నాని అడిగితే అసలు విషయం చెప్పకుండా తప్పించుకుంది. “ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు. అతడితో కనిపించే అవకాశం వస్తే డబ్బుల గురించి ఆలోచిస్తానా?” అని సెంటిమెంట్ తో కొట్టింది.  ఇంతకీ ఒక పాటకోసం ఎంత తీసుకుందని ఆరా తీయగా 50  లక్షలు తీసుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. జై లవకుశ చిత్రంలో గెస్ట్ రోల్ చేసిన నందిత రాజ్, హాసనందిని లకు కలిపి కూడా అంత  రెమ్యునరేషన్ ఇవ్వలేదని టాక్. మరి మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో ఈ శుక్రవారం తేలనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus