బాలీవుడ్ హీరోపై మనసు పడ్డ మిల్క్ వైట్ బ్యూటీ

  • March 30, 2019 / 06:49 PM IST

“బాహుబలి” ముందు వరకూ తమన్నాకు వరుస విజయాలు మాత్రమే కాక భీభత్సమైన స్టార్ డమ్ ఉండేది. “బాహుబలి” తర్వాత స్టార్ డమ్ మాత్రమే పెరిగింది కానీ విజయాలకు దూరమైంది. ఆ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ చిత్రాలన్నీ వరుసబెట్టి ఫ్లాప్ అయ్యాయి. దాంతో తమన్నా స్టేటస్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఆసక్తికరమైన ప్రొజెక్ట్స్ ఏమీ లేవు కానీ.. అమ్మడు మాత్రం ఇంకా హాట్ ప్రోపర్టీయే.

ఇటీవల ఓ మీడియా మీటింగ్ లో.. డేటింగ్‌కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారని న‌టి త‌మ‌న్నాని మీడియా ప్ర‌శ్నించింది. ఇందుకు తమన్నా వెంటనే బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్‌ పేరు తెలిపింది. “ఉరీ: ది సర్జికల్‌ స్ట్రయిక్‌” చిత్రంలో విక్కీ తన నటనతో ఫిదా చేసేశాడ‌ని చెప్పింది. అనంతరం మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ.. “ఎవరెవరో ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. కేవలం తమకు ఎదురైన అనుభవాల గురించి చర్చించుకోవడానికే మీటూ ఉద్యమం ఉంది. వాటి గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ ఒక్కోసారి ఇదేదో ఆటలా మారిపోయిందని అనిపిస్తోంది. ఈ ఉద్యమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని ఉంటే చిత్ర పరిశ్రమలో ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నామో అవి చూసేవాళ్లం అని పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus