Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Advertisement

తెలుగు ఓటీటీ ఆడియన్స్ కోసం మరో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అయ్యింది. గ్యాంగ్‌స్టర్స్ మధ్య పోరు, పాలిటిక్స్, ఫ్యామిలీ రివెంజ్ డ్రామా ప్రధానంగా రూపొందిన ఈ సిరీస్ పేరు ‘ఇసకపట్నం'(Isakapatnam). ‘అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్’ లో భాగంగా రూపొందిన ‘ఇసకపట్నం’ సిరీస్ రిలీజ్ డేట్‌ను తాజాగా రివీల్ చేశారు మేకర్స్. జులై 2వ తేదీ నుండి ఈ సిరీస్ వరల్డ్ వైడ్‌గా స్ట్రీమింగ్ కానుందని ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

Isakapatnam

సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్‌లో సునీల్, నరేష్ అగస్త్య, రాజీవ్ కనకాల, మైమ్ గోపి వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉంది. పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే రివేంజ్ డ్రామా ఇది. రా అండ్ రస్టిక్ ఫీల్ మిస్ అవ్వకుండా వయొలెన్స్, ఎమోషన్స్‌ కి పెద్ద పీట వేశారు అని ఇటీవల విడుదలైన ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు గ్యారీ బి హెచ్ వాటిని పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేస్తూ ఇంటెన్స్‌ యాక్షన్ సీన్స్ తో కథనాన్ని నడిపించారని తెలుస్తోంది.

ప్రశాంత్ రాగతి ఈ సిరీస్..కి రైటర్‌గా పనిచేయగా తాజుద్దీన్ సయ్యద్ డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. ‘తమడా మీడియా’ సంస్థపై రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఇసకపట్నం’ సిరీస్..ను నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ,ఇంగ్లీష్‌తో సహా మొత్తం 15 భాషల వెర్షన్లలో 240కి పైగా దేశాల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుండటం విశేషంగా చెప్పుకోవాలి.

బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus